Prabhas: ఆదిపురుష్ వరల్డ్ వైడ్ రైట్స్… సాహో కంటే తక్కువ.!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆదిపురుష్ జూన్ 16న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతుందన్న సంగతి తెలిసిందే. రామాయణ ఇతిహాస ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటించగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించాడు. ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్లతో ఓ రేంజ్ లో అంచనాలు పెరిగిపోగా, ఇప్పటికే సినిమాకి సంబంధించిన అడ్వాన్సు బుకింగ్లు కూడా స్టార్ట్ అయ్యాయి.

అయితే గత కొన్ని రోజులకిందటే తెలుగు రాష్ట్రాల టోటల్ బిజినెస్ లెక్కలు బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆదిపురుష్ కి సంబంధించి వరల్డ్ వైడ్ బిజినెస్ లెక్కలు వచ్చేసాయి. 5భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఏరియా వారి బిజినెస్ లెక్కలు ఇలా ఉన్నాయి.
ఏపీ, నైజాం 120 కోట్లు
కర్ణాటక 16.50కోట్లు
తమిళనాడు 5 కోట్లు
కేరళ 2కోట్లు
హిందీ&ROI 75 కోట్లు
ఓవర్సీస్ 21కోట్లు జరిగాయి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 240కోట్ల బిజినెస్ జరిగింది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రభాస్ నటించిన గత సినిమాలకంటే తక్కువ బిజినెస్ జరగడం గమనార్హం. ప్రభాస్ నటించిన బాహుబలి 2(352కోట్లు) టాప్ లో ఉండగా తర్వాతి స్థానం లో సాహో 270 కోట్లతో ఉంది. ఇక రాధేశ్యామ్ 202 కోట్లకు అమ్ముడయ్యింది.

- Advertisement -

600కోట్ల బడ్జెట్ అయిన ఆదిపురుష్ కి సాహో సినిమా కంటే తక్కువ బిజినెస్ అవుతుందని అనుకోలేదు. అయితే తెలుగు కంటే హిందీలో ఎక్కువ హైప్ ఉన్న ఈ సినిమాను ప్రొడ్యూసర్స్ చాలా చోట్ల ఓన్ రిలీజ్ చేస్తున్నారు. అందువల్ల హిందీలో ఆదిపురుష్ చిత్రానికి తక్కువ బిజినెస్ జరిగిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఆన్లైన్ బుకింగ్ల ద్వారానే 20కోట్లు వసూలు చేసేసిన ఆదిపురుష్ విడుదలయ్యే నాటికీ ఫస్ట్ డే 120 నుండి 140 కోట్ల వరకు వసూలు చేయొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు