Prabhas : ఆదిపురుష్ ప్రభంజనం షురూ.. దీనమ్మ ఇదెక్కడి మాస్ రా మావా

ప్రభాస్ రికార్డుల వేట మొదలైంది. ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ బాక్స్ ఆఫీస్ వద్ద తన పేరిట సరికొత్త రికార్డ్ లని క్రియేట్ చేసే ఆ సమయం రానే వచ్చింది.

ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ లో వస్తోన్న ఆదిపురుష్ సినిమా ఈనెల 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వబోతున్న విషయం అందరికి తెలిసిందే. రాఘవ రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా, కృతి సనన్ జానకిగా కనిపించబోతుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తున్నారు.

దాదాపు 700 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకి ఇంకా కొద్దీ రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్ లు సినిమాపై అంచనాలు పెంచేసాయి. వాల్మీకి రచించిన రామాయణ ఇతిహాసం ఆధారంగా ఓం రౌత్ ఈ సినిమాని తెరకెక్కించారు.

- Advertisement -

సినిమా రిలీజ్ కి ఇంకా కొద్దీ రోజులే ఉండటంతో ఆదిపురుష్ అడ్వాన్స్ బుకింగ్ఫ్ ని మూవీ టీం ఓపెన్ చేసారు. ఆదిపురుష్ హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోలని తలదన్నేలా అతి తక్కువ సమయంలోనే 1.50 cr టికెట్స్ అమ్మడై రికార్డ్ క్రియేట్ చేసింది.

అయితే కాసేపటి క్రితమే ఈ తెలుగులోనూ ఆదిపురుష్ అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ ఓపెన్ చేసారు. తెలుగులో కూడా ఆదిపురుష్ సినిమా రికార్డ్ బ్రేకింగ్ బుకింగ్స్ తో దూసుకుపోతుంది. ఎవ్వరు ఊహించని విధంగా బుకింగ్ ఓపెన్ చేసిన అతి కొద్దీ నిమిషాల్లోనే హైదరాబాద్ లో 50 థియేటర్ కి పైగా షోలు హౌస్ ఫుల్ అయిపోయాయి. ఇంత తక్కువ సమయంలో ఇన్ని షోలు హౌస్ ఫుల్ అయిపోవటం ఇదే మొదటిసారి అని థియేటర్ యాజమాన్యం తెలుపుతూ, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక డార్లింగ్ ఫ్యాన్స్ అయితే సంతోషంతో ఊగిపోతూ సోషల్ మీడియాలో ప్రభాస్ పోస్ట్ లతో  రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇదే ఫ్లో గనక సినిమా రిలీజ్ తరువాత కూడా కంటిన్యూ అయితే ఆదిపురుష్ సినిమా ప్రభాస్ కెరీర్ మరో మైలు రాయిగా నిలిచిపోవడం కన్ఫామ్.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు