Megha Akash : ఆ హీరోయిన్ పెళ్లిపై స్పందించిన ఆమె తల్లి- పిచ్చి పిచ్చి రాతలు రాస్తే చెప్పు తెగుద్దని వార్నింగ్

సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే టాలెంట్ తో పాటు, అదృష్టం కూడా ఉండాలని చాలా మంది చెబుతుంటారు. అయితే ఇది ఇండస్ట్రీలో ఉండే చాలా మంది జీవితంలో నుంచి వచ్చిన మాటే అని కొంతమంది హీరో, హీరోయిన్ లు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లని చూస్తే అనిపిస్తుంటుంది.

కొంతమంది హీరోయిన్స్ లో అందం, టాలెంట్ లేకపోయిన వరుస సినిమాలు చేస్తూ పోతుంటారు. అయితే ఇంకొంతమంది మాత్రం ఎంత అందంగా ఉన్న, టన్నుల కొద్దీ టాలెంట్ ఉన్న సినిమాల్లో మాత్రం రాణించలేకపోతుంటారు. అయితే ఈ కేటగిరికి చెందిన హీరోయిన్స్ లో మేఘ ఆకాష్ కూడా ఒకరు.

నితిన్ హీరోగా నటించిన లై సినిమాతో తెలుగు తెరకి హీరోయిన్ గా పరిచమైన ఈ ముద్దుగుమ్మ, తన అందంతో మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించినంత విజయం సాధించకపోయినా.. మేఘ ఆకాష్ కి మాత్రం మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా తరువాత మేఘ ఆకాష్ కు తమిళ్, తెలుగు, హిందీ సినిమాల్లో వరుసగా అవకాశాలు వచ్చాయి. కానీ ఈ అమ్మడు దురదృష్టమో ఏమోగానీ చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూనే వచ్చాయి.దాంతో ఈ హీరోయిన్ సినిమాలు సెట్ అవ్వట్లేదని ఇండస్ట్రీకి బాయ్ బాయ్ చెప్పి ప్రముఖ పొలిటిషన్ ని పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.

- Advertisement -

వీటిపై మేఘ ఆకాష్ ఏ విధంగానూ స్పందించకపోవటంతో ఈ వార్త నిజమే అనుకున్నారు. అయితే ఇటీవలనే మేఘ ఆకాష్ మదర్ ఈ విషయంపై స్పందించి. ఆ వార్తలో ఎటువంటి నిజం లేదని. పిచ్చి పిచ్చి రాతలు రాయొద్దని తన కూతురుకి ఇప్పట్లో పెళ్లి చేసే ఉద్దేశ్యం లేదని ఆమె మీడియాకి చెప్పడంతో ఈ రూమర్స్ కి బ్రేక్ పడింది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు