14Reels: పోలీస్ ఆఫీసర్ గా చేయనున్న బెల్లంకొండ శ్రీనివాస్.. ఈసారైనా కలిసొచ్చేనా?

బెల్లం కొండ సాయి శ్రీనివాస్ కి ఇప్పుడు కసిమీదున్నాడు. అర్జెంట్ గా ఒక నిఖార్సైన హిట్టు పడాలి. ఎన్నో ఆశలు పెట్టుకున్న బాలీవుడ్ డెబ్యూ మూవీ ఛత్రపతి డిజాస్టర్ అయ్యింది. ఈ మూవీతో సాలిడ్ హిట్టు కొట్టి బాలీవుడ్ లో పాగా వేయాలని చూసిన ఈ అల్లుడు శీను ప్లానింగ్ బెడిసికొట్టింది. మొదటిరోజే ఢమాల్ అయిన ఆ సినిమా అల్ట్రా డిజాస్టర్ అవడమే కాకుండా బెల్లం కొండ శ్రీనివాస్ పై విపరీతంగా ట్రోల్స్ రావడానికి కారణం అయింది.

బాలీవుడ్ డెబ్యూ ఫెయిల్ అవ్వడం వల్ల తిరిగి టాలీవుడ్ కి వచ్చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే కొత్త మూవీ స్టార్ట్ చేయనున్నాడు. అయితే ఇంతకు ముందే శ్రీనివాస్ స్టూవర్టుపురం దొంగ అనే సినిమా చేయాల్సి ఉండగా, పలు కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. అయితే కొన్ని నెలల ముందు 14రీల్స్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేస్తున్నాడని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ ఫేమ్ కే. సాగర్ చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడని తెలిసిందే. అయితే ఈ సినిమా కు సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.

14రీల్స్ బ్యానర్ లో తెరకెక్కబోయే ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడని తాజా సమాచారం. అయితే ఇంతకు ముందే శ్రీనివాస్ కవచం అనే సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ఆడలేదు. మరి ఈ సారైనా ఈ హీరోకు పోలీస్ పాత్ర కలిసొస్తుందా? బెల్లంకొండ శ్రీనివాస్ కి సరైన హిట్ వస్తుందా లేదా అన్నది చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు