Ponniyin Selvan1 : తెలుగు మార్కెట్ పై గురి

అగ్ర ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం తెర‌కెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం పొన్నియ‌న్ సెల్వ‌న్‌. ఈ చిత్రం రెండు పార్ట్‌లుగా రాబోతుంది. పొన్నియ‌న్ సెల్వ‌న్-1 సెప్టెంబ‌ర్ 30న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. తాజాగా తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన అప్‌డేట్ బ‌య‌టికి వ‌చ్చింది. మ‌ణిర‌త్నం సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు కావ‌డం, ద‌క్షిణాది భాష‌లో ఫేమ‌స్ అవ్వ‌డంతో ఆయ‌న సినిమాల‌ను దాదాపు అంద‌రూ చూస్తుంటారు.

పొన్నియ‌న్ సెల్వ‌న్ సినిమాను భారీగా విడుద‌ల చేయ‌నున్నారు. పైగా ఇది మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌. ఎప్ప‌టి నుంచో ఈ సినిమా తీయాల‌ని ఆయ‌న క‌ల. ఆ క‌ల ఇప్పుడు నెర‌వేరింద‌ట‌. తెలుగులో సినిమాను హైప్ తీసుకొచ్చేందుకు ఈనెల 23న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హిస్తున్నారు. హైద‌రాబాద్‌లోని జేఆర్‌సీ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో సాయంత్రం 6 గంట‌ల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రుగ‌నుంది. ఇక ఇప్ప‌టికే చెన్నైలో ఆడియో, ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్స్ జ‌రిగిన విష‌యం తెలిసిందే.

ఇక మ‌ణిర‌త్నం టీమ్ ప్ర‌మోష‌న్ల‌ను పెంచే బిజీలో ఉంది. తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో ఈ సినిమాను తెర‌కెక్కుతుంది. ఇక ఈ చిత్రంలో చియాన్ విక్ర‌మ్‌, శ‌ర‌త్‌కుమార్‌, ప్ర‌కాశ్ రాజ్‌, అర‌వింద్ స్వామి, జ‌య‌రామ్‌, విక్ర‌మ్ ప్ర‌భు, కార్తీ, జ‌యంర‌వి, పార్థిబ‌న్‌, శోభితా దూళిపాళ‌, ఐశ్వ‌ర్య‌రాయ్, త్రిష వంటి న‌టీన‌టులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని మ‌ద్రాస్ టాకీస్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఫ‌లితం ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు