Tollywood : రాజకీయ రంగు ?

టాలీవుడ్ లో ప్రస్తుతం వస్తున్న సినిమాలపై రాజకీయ రంగు పులుముకుంటుంది. సినిమాలకు రాజకీయ పార్టీలను అంటగట్టి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. హీరోలను, దర్శకులను డైరెక్ట్ గా టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. ఇటీవలే యంగ్ హీరో నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమా డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గురించి జరిగిన రచ్చ అంతా ఇంత కాదు.

మూడేళ్ల క్రితం రాజశేఖర్ రెడ్డి వైసీపీ పార్టీకి మద్దతుగా ఓ ట్వీట్ చేశాడంటూ కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ ట్వీట్ లో ఓ వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయని, ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్ల నియోజకవర్గం సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే, ఈ ట్వీట్ ఫోటోషాప్ చేశారని, తనకు ట్వీట్ కు ఎలాంటి సంబంధం లేదని డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి వివరణ ఇచ్చాడు. ఏం జరిగినా, నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాపై బురద చల్లే ప్రయత్నం గట్టిగానే జరిగిందని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

మళ్లీ ఇప్పుడు ఇదే తరహాలో మరో సినిమా టార్గెట్ అవుతునట్టు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ శుక్రవారం విడుదలైంది. మిక్సిడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. డైరెక్టర్ శరత్ మండవపై కొంతమంది నెటిజన్లు మండిపడుతున్నారు. రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో కొన్ని డైలాగ్స్ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేలా ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు.

- Advertisement -

గతంలో శరత్ మండవ, టీడీపీకి మద్దతుగా, వైసీపీకి వ్యతిరేకంగా ట్వీట్ చేశారంటూ, కొన్ని ట్వీట్లను బయటపెట్టారు. ఈ ట్వీట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ట్వీట్లు ఎంత వరకు నిజమో తెలియదు కానీ, రామారావు ఆన్ డ్యూటీపై కూడా రాజకీయ రంగు పడింది. ఇప్పటికే కొంత వరకు నెగిటివ్ టాక్ తెచ్చుకున్న రామారావు ఆన్ డ్యూటీకి ఇది మరింత మైనస్ గా మారనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు