మహేష్ బాబు కెరియర్ లో ఎన్ని హిట్ సినిమాలు ఉన్నా పోకిరి సినిమా స్థాయి వేరు , ఆ స్థానం వేరు. మహేష్ తో మొదటిసారి వర్క్ చేసిన పూరి జగన్నాథ్, మహేష్ కెరియర్ లో చిరకాలం గుర్తుండిపోయే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. 2006 లో రిలీజైన పోకిరి సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంత ఇంతా కాదు ఒక రేంజ్ లో మహేష్ బాబును నిలబెట్టిన సినిమా అది. పండుగాడిగా, కృష్ణమనోహర్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు పెర్ఫార్మన్స్,మాస్ స్టైల్, స్వాగ్ ని ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఎప్పటికీ మర్చిపోలేరు.
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు ఇప్పుడు ఆ సినిమాను చూసిన అదే హై ఉంటుంది. పోకిరి సినిమాను థియేటర్స్ లో మిస్ అయినవాళ్లకు, మరోసారి థియేటర్స్ లో చూసే అవకాశం రాబోతుంది. ఈ ఏడాది మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆగష్టు 9న పోకిరి మూవీ 4కె వర్షన్ ని గ్రాండ్ గా థియేటర్స్ లో రీ రిలీజ్ చేయబోతున్నారట. ఇప్పటికే ఈ మూవీ 4కె వర్షన్ కోసం అందరూ ఎప్పటినుండో ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బర్త్ డే రోజున అది రిలీజ్ కావడం, మహేష్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ కి , సినీ ప్రేమికులకు ఇది సూపర్ ట్రీట్ అనే చెప్పాలి.