PKSDT : పవన్ కళ్యాణ్& సాయి ధరమ్ సినిమా పేరు ఏంటో తెలుసా !

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో సినిమా వస్తోన్న సంగతి అందరికి తెలిసిందే.. తమిళ్ లో సూపర్ హిట్టయిన వినోదయ సీతాం రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. తమిళ్ ఒరిజినల్ వెర్షన్ డైరెక్ట్ చేసిన సముద్రకనినే ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి సంబంధించి తన పార్ట్ షూటింగ్ ని కంప్లిట్ చేసాడు. ప్రస్తుతం వరుస సినిమాలని నిర్మిస్తూ టాలీవుడ్ లో దూసుకుపోతున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే కొద్దీ రోజులక్రితం సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన విరూపాక్ష సినిమా రిలీజ్ ఉండటం వల్ల PKSDT సినిమా షూటింగ్ కి కొద్దిరోజులు బ్రేక్ పడింది.ఇప్పుడిప్పుడే విరూపాక్ష హ్యాంగ్ఓవర్ నుంచి బయటికి వచ్చిన సాయి మళ్ళీ షూటింగ్ రిస్యూమ్ చేయడానికి రెడీ అయ్యాడు.

త్రివిక్రమ్ మాటలు అందిస్తున్న ఈ సినిమా టైటిల్ ని వచ్చే రెండు, మూడు రోజుల్లో ప్రకటించబోతున్నట్టు టాక్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గోపాల గోపాల సినిమా తరహాలో ఉండే రోల్ లో కనిపించబోతున్నరంట. దాదాపు 45నిమిషాల నిడివితో పవన్ కళ్యాణ్ పాత్ర ఉండబోతుందని సమాచారం. గోపాల గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్, వెంకటేష్ వెనక ఉండి కథ నడిపించినట్టుగా ఈ సినిమాలో కూడా సాయి ధరమ్ తేజ్ వెనక ఉండి పవన్ సినిమాని నడిపించబోతున్నరంట. అయితే ఈ సినిమా టైటిల్ కి “బ్రో”(BRO) అనే పేరుని పరిశీలిస్తున్నట్టు టాక్. ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ ని దృష్టిలో పెట్టుకొని త్రివిక్రమ్ ఈ పేరుని సూచించినట్టు తెలుస్తోంది. టైటిల్ బట్టి చూస్తే సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ ని బ్రో అని పిలుస్తుండొచ్చు. ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఆల్రెడీ విరూపాక్షతో సక్సెస్ లో ఉన్న సాయికి ఈ సినిమా మరి ఎంతటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు