Vijay devarakonda : రిలీజైన ఖుషి మూవీ ఫస్ట్ సింగిల్.. సాంగ్ స్పెషాలిటీ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు ?

విజయ్ దేవరకొండ పుట్టిన రోజు స్పెషల్ గా, విజయ్ హీరోగా నటిస్తున్న ఖుషి మూవీలోని మొదటి పాటని రిలీజ్ చేసారు మూవీ యూనిట్. నిన్ను కోరి మూవీ ఫెమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో విజయ్ కి జోడిగా సమంత నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిపోవాల్సిన ఈ సినిమా సమంత ఆరోగ్య పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల చాలా రోజులుగా హోల్డ్ లో పడిపోయింది. ఈ మధ్యనే సమంత ఆరోగ్యం కుదుటపడటంతో ఈ సినిమా షూటింగ్ తిరిగి స్టార్ట్ అయింది.

నా రోజా నువ్వే అంటూ సాగే ఈ పాటకి డైరెక్టర్ శివ నిర్వాణనే లిరిక్స్ రాసారు. అయితే ఈయన డైరెక్ట్ చేసిన సినిమాలలో ఒక్క పాట రాయటం ఈయనకి అలవాటు అదే అలవాటు తో ఖుషి సినిమాలో కూడా ఈ పాట రాసారు. అయితే ఈ సాంగ్ లిరిక్స్ మాత్రం ఆయన రాసిన ఇంతకుముందు రాసిన సినిమాలలో సాంగ్స్ లాగా కాకుండా కొత్తగా ఉన్నాయి. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఎవర్గ్రీన్ సూపర్ హిట్ సినిమాలపేర్లని శివ నిర్వాణ తన కలానికి చేర్చి ఈ పాటలో లిరిక్స్ గా రాసారు.

లిరికల్ వీడియోని బట్టి చూస్తే ఖుషి సినిమా విజయ్ గత చిత్రాల లాగా కాకుండా కొత్తగా ఉంది. స్క్రీన్ పై విజయ్, సమంతల జోడి కూడా చూడ ముచ్చటగా ఉంది. అయితే ఆశ్చర్యంగా సమంత ఈ సినిమాలో ముస్లింగా నటిస్తున్నట్టు అనిపిస్తుంది. అది మరి నిజమేనో కాదో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకి వేచి చూడాలి. ఖుషి సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. లైగర్ సినిమా ఆశించినంత విజయం సాధించకపోయిన విజయ్ దేవరకొండ కి పాన్ ఇండియా వైడ్ మార్కెట్ అయితే ఓపెన్ అయింది. అది దృష్టిలో పెట్టుకొని ఖుషి సినిమాని కూడా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ పాన్ సినిమాతోనైన విజయ్ హిట్ కొడతాడో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు