OG official release date :”ఓజి” అఫిషియల్ రిలీజ్ డేట్… ఇండస్ట్రీ హిట్ డేట్ ఫిక్స్

 OG official release date

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాహో ఫేమ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో “ఓజి” అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీలో తమిళ బ్యూటీ ప్రియాంక అరుణ్ మోహన్ కథానాయికగా కనిపించబోతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న “ఓజి” మూవీ రిలీజ్ డేట్ పై మేకర్స్ అధికారికంగా అనౌన్స్మెంట్ ఇచ్చారు.

బాలు, పంజా వంటి సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న గ్యాంగ్ స్టార్ మూవీ “ఓజి”నే కావడంతో, ఈ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. 90s బ్యాక్ డ్రాప్ లో సాగనున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందట. చాలా కాలంగా పవర్ స్టార్ అభిమానులు ఈ మూవీ అప్డేట్ గురించి ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. “ఓజి” ఈ ఏడాది ఫస్ట్ ఆఫ్ లోనే ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుందని రూమర్లు వచ్చాయి. కానీ షూటింగ్ చివరి దశకు చేరుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి రాజకీయాలపై ఫోకస్ చేయడం వల్ల అది వాయిదా పడింది. అలాగే నిర్మాతలు కూడా ఇప్పట్లో ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ అడగకండి అంటూ అధికారికంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అసలు ఈ మూవీ ఈ ఏడాది రిలీజ్ అవుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక గత కొన్ని రోజుల నుంచి “ఓజి” మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది అనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆ రూమర్లనే నిజం చేస్తూ మేకర్స్ సెప్టెంబర్ లో “ఓజి” మూవీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.

సెప్టెంబర్ 27న”ఓజి” మూవీని రిలీజ్ చేయబోతున్నాం అంటూ తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ డేట్ తో పాటు పవన్ కళ్యాణ్ ఉన్న కొత్త పోస్టర్ ను వదిలారు. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన “అత్తారింటికి దారేది” సినిమా కూడా సెప్టెంబర్ 27న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అందుకే ఆ గోల్డెన్ డేట్ పైనే “ఓజి” నిర్మాతలు కర్చీఫ్ వేసేశారు. పక్కా ప్లానింగ్ తో “ఓజి” మూవీని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. మొత్తానికి అఫీషియల్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి పవర్ స్టార్ అభిమానుల్లో ఫుల్ జోష్ పెంచేశారు “ఓజీ” నిర్మాతలు. ఇదిలా ఉండగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేయాల్సిన పలు సినిమాలు పెండింగ్ లోనే ఉన్నాయి. డైరెక్టర్ హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్, క్రిష్ తో హరిహర వీరమల్లు సినిమాలను పవన్ పూర్తి చేయాల్సి ఉంది. వాస్తవానికి అన్నింటికంటే చివరగా పవన్ సైన్ చేసిన మూవీ “ఓజి”నే. కానీ ఇదే అన్నింటికంటే ముందు రిలీజ్ అవుతుండడం విశేషం.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు