OG : పదేళ్ల క్రిందట వచ్చిన తుఫాన్ గుర్తుందా

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పుడైతే బుక్ మై షో లో టిక్కెట్లు బుక్ చేసుకుని సినిమాలు చూస్తున్నాం. కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకి టికెట్ దొరకాలంటే రాత్రంతా థియేటర్ దగ్గర వెయిట్ చేయాల్సిందే. గంటలు గంటలు క్యూలో నిలబడాల్సిందే. అది పవన్ కళ్యాణ్ రేంజ్ అంటే.

జానీ సినిమా తర్వాత పదేళ్లు హిట్టు లేకపోయినా కూడా ఆయన ఇమేజ్ మాత్రం చెక్కుచెదరలేదు. సినిమా డిజాస్టర్ అవుతున్న కొద్దీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ వచ్చింది. అయితే అజ్ఞాతవాసి సినిమా తర్వాత కొన్నేళ్లు సినిమాలో గ్యాప్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. మళ్లీ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సినిమా తర్వాత చేసిన సినిమాలు కూడా అభిమానులకు మంచి ఆనందం ఇచ్చాయి. రీ ఎంట్రీ తరువాత పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్ని రీమేక్ సినిమాలు.

ఒకటి కూడా స్ట్రయిట్ ఫిల్మ్ అంటూ రాలేదు. పవన్ కళ్యాణ్ నుంచి ఒక రీమిక్ సినిమా కాకుండా డైరెక్ట్ సినిమా వస్తే చూడ్డానికి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ చేస్తున్న ఫిలిం ఓజి. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డి వి వి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఈ సినిమా గ్లిమ్స్ కూడా మంచి అంచనాలను పెంచింది. ఇకపోతే ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు పదేళ్ల క్రితం సెప్టెంబర్ 27న అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ అయి ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

- Advertisement -

అప్పట్లో తెలుగు సినిమా చరిత్రలో ఆల్ టైం రికార్డ్ అత్తారింటికి దారేది సినిమా. తెలుగు సినిమా స్టామినాని బయటకు తీసిన సినిమా అత్తారింటికి దారేది. ఆ సినిమా 90 నిమిషాల పాటు లీక్ అయినా కూడా సినిమాకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. అద్భుతమైన ఆదరణ లభించింది. మంచి కలెక్షన్స్ రాబట్టింది. పవన్ కళ్యాణ్ క్రేజ్ అంటే ఏంటో మరోసారి బాక్సాఫీస్ వద్ద రుజువైంది. మళ్లీ అదే డేట్ కి 10 ఏళ్ల తర్వాత ఒక సినిమా వస్తుంది. దీంతో ఓజి లో డైలాగ్ అందరికీ గుర్తొస్తుంది. పదేళ్ల క్రిందట వచ్చిన తుఫాన్ గుర్తుందా అనే డైలాగ్ ఇప్పుడు పాపులర్ అవుతుంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు