Samantha: నందమూరి బాలయ్య సినిమాలో సమంత ?

Samantha

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే స్టార్ హీరోయిన్గా మారుతున్నారు. మరికొంతమంది మాత్రం ఇండస్ట్రీలోనే అట్టడుగునా ఉంటున్నారు. ఇక మరికొంతమంది మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్గా మారిపోతున్నారు. అలా… తొలి సినిమాతోనే హిట్ అయిన టాలీవుడ్ హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అందులో హీరోయిన్ సమంత మొదటి వరుసలో ఉంటారు.

హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన అందంతో పాటు నటనతో బాగా ఆకట్టుకుంటుంది సమంత. అందుకే ఇప్పటికీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర శ్రేణి హీరోయిన్ గా కొనసాగుతున్నారు సమంత. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో బంపర్ విజయాన్ని అందుకున్న సమంత ఆ తర్వాత వెనక్కి చూసుకోలేదు. ఈ సినిమా బంపర్ హిట్ కావడమే కాకుండా… నాగచైతన్య తో వివాహం కూడా అయింది.

దీంతో నిర్మాతలు కూడా సమంతతో సినిమా చేయాలని బాగానే ఛాన్సులు ఇచ్చారు. ఈతరణంలోనే మెగా హీరోల నుంచి నందమూరి హీరోల వరకు అందరి సరసన సమంత హీరోయిన్గా నటించింది. అయితే తాజాగా బాలయ్య సినిమాలో హీరోయిన్ సమంత నటించిన సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటి బాలయ్య సినిమాలో సమంత అని అనుకుంటున్నారా..? అవును ఈ వార్త నిజమే. బాబీ దర్శకత్వంలో… నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కొన్ని కామెడీ సీన్స్ ఉన్నాయట. ఆ సమయంలో ఏం మాయ చేసావే క్లిప్స్ కొన్ని ప్లే అవుతాయని సమాచారం. అందులో సమంత పాత్రను బాగా హైలెట్ చేస్తారట. ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు