Hari hara veera mallu: పవర్ స్టార్ ఫ్యాన్స్ కి సాలిడ్ న్యూస్..

Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపి రాజకీయాల్లో బిజీ గా ఉండడం వల్ల ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయన్న సంగతి తెలిసిందే. వాటిలో ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి తో పాటు “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ వాయిదా వల్ల హరీష్ శంకర్ రవితేజ తో mr బచ్చన్ తెరకెక్కిస్తున్నాడు. మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత పీకే సినిమా స్టార్ట్ చేస్తామని ఆగిపోలేదని చెప్పాడు. ఇటు సుజీత్ ఓజి కూడా ఆగిపోలేదని మేకర్స్ ముందే చెప్పగా, షూటింగ్ ఆల్మోస్ట్ 80 శాతం పూర్తయిందని సెప్టెంబర్ 27 కి థియేటర్లలో రిలీజ్ చేస్తామని కంఫర్మ్ కూడా చేసారు.

ఎటొచ్చి క్రిష్ హరిహరవీరమల్లు గురించే ఇప్పటివరకూ ఏ క్లారిటీ లేదు. నిజానికి పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటిదాకా రిలీజ్ డేట్ కి నోచుకోలేదు. కనీసం షూటింగ్ ఎంతవరకు పూర్తయిందన్న విషయంపై కూడా స్పష్టత లేదు. ఒకానొకసమయంలో ప్రాజెక్టు సినిమా ఆగిపోయిందని నిర్మాత ఏఎం రత్నంకు పవన్ రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేస్తున్నట్టు ప్రచారాలు కూడా జరిగాయి. ఇదీ గాక పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ తర్వాత సినిమాలు మొదలు పెట్టినా ఓజి, ఉస్తాద్ లు తొందరగా ఫినిష్ అయ్యే ఛాన్స్ ఉండడం వల్ల ముందు ఆ సినిమాలే ఫినిష్ చేయొచ్చని, క్రిష్ సినిమాని ఈ ఇయర్ ఎండింగ్ లో స్టార్ట్ చేయొచ్చని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. అయితే ఎట్టకేలకు మూవీ మేకర్స్ నుండి ఈ అనుమానాలన్నిటికి తెర దించుతూ ఒక స్పష్టమైన అప్డేట్ వచ్చేసింది.

- Advertisement -

హరిహర వీరమల్లు ఆగిపోలేదని, ప్రస్తుతం ఈ పాన్ ఇండియా మూవీకి సంబంధించిన విఎఫ్ఎక్స్ పనులు ఇరాన్, కెనడా, బెంగళూరు, హైదరాబాద్ ఇంకా చెన్నై ప్రాంతాల్లో ఆడియన్స్ ఊహించని రేంజ్ లో మంచి విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నామని, ఆ థ్రిల్ ని త్వరలోనే టీజర్ రూపంలో ఆస్వాదించడానికి రెడీ కమ్మని చెబుతూ ట్వీట్ చేయడం జరిగింది. ఇదిలా ఉండగా సినిమా షూటింగ్ ఇంకా మరో 30 శాతం వరకు పెండింగ్ లో ఉందని సమాచారం. అయితే క్రిష్ అనుష్కతో ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా మొదలుపెట్టినా, పవన్ కళ్యాణ్ సెట్స్ లోకి రాగానే వీరమల్లుపైనే ద్రుష్టి పెడతాడని, కొంచెం టైం పట్టినా వీరమల్లు ఖచ్చితంగా థియేటర్లలో వస్తాడని మేకర్స్ నుండి సమాచారం వచ్చింది.

ఇక నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న హరిహరవీరమల్లులో బాబీ డియోల్ లాంటి స్టార్లు కూడా నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమ 2024 లో విడుదల కాకపోయినా, ఓజి సెప్టెంబర్ లో వచ్చేస్తుంది కనక 2025 సమ్మర్ లో హరిహర వీరమల్లుని ప్లాన్ చేసుకోవచ్చు. కుదరకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చాక అయినా రావచ్చు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు