Yodha : ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించడానికి మేకర్స్ కష్టాలు..

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ఈ ఇయర్ ప్లాప్ తోనే ఖాతా తెరిచిందని చెప్పాలి. ఫైటర్ వంటి భారీ చిత్రాల్ని కూడా ఆడియన్స్ రిజెక్ట్ చేసారు. అయితే రీసెంట్ గా వచ్చిన సైతాన్ సినిమాతో బాలీవుడ్ మళ్ళీ ట్రాక్ లోకి ఎక్కినట్టు అనిపించింది. ఆ సినిమా ప్రేక్షకుల నుండి యానానిమస్ గా పాజిటివ్ టాక్ తెచ్చుకుని 150 కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతుంది. ఇక బాలీవుడ్ గాడిలో పడినట్టే అనుకున్న తరుణంలో మరో భారీ సినిమా ప్రేక్షకుల నుండి నిరాదరణ కి గురవుతుంది. ఆ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా ప్రేక్షకులు థియేటర్ల కి రాలేని పరిస్థితి వచ్చింది. వివరాల్లోకి వెళితే బాలీవుడ్ స్టార్ సిద్ధార్థ్‌ మల్హోత్రా, దిశా పటానీ, టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘యోధ‌’. సాగర్ ఆంబ్రే, పుష్కర్ ఓఝా సంయక్తంగా ఈ సినిమాకి దర్శకత్వం వహించగా, ధర్మ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై కరణ్‌ జోహర్‌ నిర్మించాడు. ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ యాక్షన్ మూవీకి ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన లభిస్తుంది. అక్కడి క్రిటిక్స్ పాజిటివ్ రివ్యూలు ఇచ్చినా, బాక్సాఫీస్ కలెక్షన్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి.

సినిమా కథ విషయానికి వస్తే..

తండ్రి స్ఫూర్తితో యోధా టాస్క్‌ఫోర్స్‌లో క‌మాండోగా చేరిన అరుణ్ క‌టియాల్ (సిద్ధార్థ్ మ‌ల్హోత్రా) ఆప‌రేష‌న్స్‌లో పాల్గొనే క్ర‌మంలో కొన్నిసార్లు నిబంధ‌న‌ల్ని కూడా అతిక్ర‌మిస్తుంటాడు. అరుణ్ చేప‌ట్టిన ఓ మిషన్ ఫెయిల్ అవ్వడంతో ఉగ్ర‌వాదుల చేతుల్లో ఒక సైంటిస్ట్ హ‌త్య‌కి గుర‌వుతాడు. దీంతో అరుణ్ ఆ పదవిని వదిలి ఎయిర్ క‌మాండోగా డిల్లీ నుంచి లండ‌న్ వెళ్లే విమానంలో ప్రయాణం చేస్తాడు. ఈ క్రమంలో అరుణ్ ని వాడుకొని భారత ప్రభుత్వం దగ్గర తమ డిమాండ్లు తీర్చుకోవాలని ప్లాన్ చేసుకున్న టెర్రరిస్టులు, ఆ ఫ్లైట్ ని హైజాక్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? టెర్రరిస్టుల ప్లాన్ ని అరుణ్ ఎలా ఛేదించాడు? వారి కుట్ర‌ల‌ని ఎలా తిప్పికొట్టాడనేదే సినిమా కథ.

- Advertisement -

అయితే విమానాల హైజాక్ నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. తెలుగులో కూడా అక్కినేని నాగార్జున హీరోగా ఆకాశ వీధిలో, గగనం లాంటి సినిమాలు ఇదే బ్యాక్ డ్రాప్ లో రూపొందాయి. ఇప్పుడు అదే ఫ్లైట్ హైజాక్ కథాశంతో ‘యోధ’ సినిమా తెరకెక్కింది. అయితే చెప్పుకోడానికి ఏమాత్రం కొత్త‌ద‌నం లేని ఈ క‌థతో ఉన్నా, ఏరియ‌ల్ వ్యూతో కూడిన సీన్స్, ఫ్లైట్ లో ఫైట్ సీన్స్, ట్విస్టులు ఆకట్టుకుంటున్నాయి.కానీ పెద్దగా ఆసక్తిని కలిగించే స‌న్నివేశాలేవీ ఈ సినిమాలో లేకపోవడం మైనస్ గా చెబుతున్నారు. అయితే ట్విస్టులతో కూడిన క‌థ‌నం రాసుకున్న‌ప్ప‌టికీ, ప్రేక్షకులకి కొత్త‌ద‌నాన్ని ఇవ్వడంలో విఫలం అయినట్లుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇందుకే..

అయితే సినిమా మిక్సడ్ రివ్యూ ల వల్ల ‘యోధ’ సినిమాకి ఆ టాక్ కు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వసూళ్లు వస్తున్నాయి. ఫస్ట్ డే కేవలం 4.25 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. అయితే రెండో రోజు నుంచి జనాలను థియేటర్లకు రప్పించడానికి మేకర్స్ వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్ పెట్టడం జరిగింది. అయినా కూడా థియేటర్లకు జనాలు వస్తారని గ్యారెంటీ లేదు. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సైతాన్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతుంది.

ఇప్పటికే వంద కోట్ల మార్క్ దాటిన ఈ సినిమా 150 కోట్ల దిశగా దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాతో పోటీగా యోధ కి కల్లెక్షను వస్తాయంటే అంత ఈజీ కాదు. టికెట్ రేట్లు తగ్గించినా, చిత్ర యూనిట్ కూడా జనాల్లోకి వచ్చి ప్రమోట్ చేస్తేనే ఏమైనా ప్రభావం ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మరి నిర్మాత కరణ్ జోహార్ ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించడానికి ఇంకెంత కష్టాలు పడాల్సి వస్తుందో చూడాలి.

Check Filmify Telugu for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు