Bimbisara : బింబిసార నుండి తేనె పలుకులు

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన సినిమా “బింబిసార”. బింబిసారుని బయోపిక్ గా సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కొత్త డైరెక్టర్ వశిష్ఠ్ దర్శకత్వంలో రూపొందుతుంది. హీరోయిన్లుగా కేథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన ట్రైలర్, ఒక పాట భారీ అంచనాలు పెంచుతున్నాయి. దీంతోపాటు కళ్యాణ్ రామ్ కెరీయర్ లో మొదటి సారి సోషియో ఫాంటసీ మూవీ రావడంతో నందమూరి ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగింది.

తాజాగా ఈ సినిమాను తేనె పలుకుల అమ్మాయి ఫుల్ ఆడియో సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. హీరోయిన్ కేథరిన్ ట్రెసా అందాన్ని కళ్యాణ్ రామ్ పొగుడుతున్నట్టు ఈ పాట ఉంది. మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ఈ పాటకు లిరక్స్, సంగీతాన్ని వరికుప్పల యాదగిరి అందించాడు. సత్య యామిని, హైమత్ పాడారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం. ఎం కీరవాణి కంపోజ్ చేశాడు. అలాగే యశ్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశాడు. కాగా ఫుల్ వీడియో సాంగ్ ను ఈ నెల 23న చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఈ పాటతో “బింబిసార”పై అభిమానులకు మరింత ఆసక్తి పెరిగింది. ఈ సినిమా ఆగస్టు 5న థియేటర్ లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు