NTR : ‘కళ్యాణ్ రామ్ లేకుంటే బింబిసార లేదు’

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా లేటెస్ట్ గా వస్తున్న సినిమా బింబిసార. కొత్త దర్శకుడు మల్లిడి వశిష్ఠ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై హరికృష్ణ కే నిర్మిస్తున్నాడు. కేథ‌రిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రూ. 40 కోట్లతో రూపొందించిన ఈ సినిమా ఆగస్టు 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుంది. దీని కోసం చిత్ర బృందం ఇప్పటికే ప్రమోషన్స్ పనులను ప్రారంభించింది. బింబిసార నుంచి విడుదలైన పాటలు, టీజర్, రెండు ట్రైలర్లు ప్రేక్షకుల్లో అంచనాలను పెంచాయి.

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపుకున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తారక్ మాట్లాడుతూ.. తాను బింబిసార సినిమా చూశానని అన్నాడు. ‘కొత్త దర్శకుడు వశిష్ట్ ఎలా హ్యాండిల్ చేస్తాడు అనుకున్నాను. కానీ చాలా అద్భుతంగా సినిమాను తెరకెక్కించాడు. అన్నయ్య కళ్యాణ్ రామ్ కెరీర్.. బింబిసార ముందు, తర్వాత అనేలా ఉంటుంది. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేస్తాడు. అన్నయ్య తన సినిమాలకు చాలా కష్టపడతాడు. ఈ సినిమా కోసం ఇంకా ఎక్కువ కష్టపడ్డాడు. కళ్యాణ్ రామ్ లేకుంటే బింబిసార లేదు. బింబిసార కు న్యాయం చేయగలిగే నటుడు అన్నయ్య మాత్రమే’ అంటూ తారక్ చెప్పాడు.

అలాగే థియేటర్స్ గడ్డు పరిస్థితి ఉంది అని అంటున్నారు, దీనిని తాను నమ్మను అని అన్నాడు. సినిమా బాగుంటే, ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని చెప్పాడు. బింబిసారి ప్రేక్షకులకు నచ్చే సినిమా అని, ఈ సినిమా కోసం ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని ధీమా వ్యక్తం చేశాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు