Allu Arjun : ఊర మాస్ గెటప్

ఐకాన్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల యాడ్ ఫిలిమ్స్ తో బిజీ అయ్యాడు. “పుష్ప 2” సినిమా షూటింగ్ కు ఇంకా సమయం ఉండటంతో, ఈ గ్యాప్ లో యాడ్స్ చేసుకుంటూ క్యాష్ చేసుకుంటున్నాడు. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన పుష్పాకు సీక్వెల్ గా పుష్ప 2 వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఇదిలా ఉండగా, ఇటీవల డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ యాడ్ చేసిన ఈ స్టైలిష్ స్టార్, ప్రస్తుతం హరీష్ శంకర్ తో జతకట్టాడు. దర్శకుడు హరీష్ శంకర్ – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన “డీజే” చిత్రం మంచి విజయం సాధించడమే కాదు, భారీ వసూల్లనూ రాబట్టింది.

ప్రస్తుతం వీరిద్దరూ మరోసారి జత కట్టారు. హరిష్ శంకర్ దర్శకత్వంలో బన్నీ ఓ యాడ్ ఫిలిం కోసం పనిచేశారు. దీనికి ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ సుదీప్ చటర్జీ కూడా పనిచేశారు. ఈ షూటింగ్ థాయిలాండ్ లో జరిగినట్టు సమాచారం. ఈ యాడ్ లో బన్నీ పూర్తిగా ఊర మాస్ లుక్ లో కనిపించాడు. చేతిలో సిగార్, లైట్ గా జుట్టు నేరుస్తున్నట్లు వైట్ కలరింగ్, కళ్ళజోడు, చెవి పోగులు, సైడ్ కటింగ్ పిక్స్ తో రచ్చ చేస్తున్నాడు. “పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం” అంటూ క్యాప్షన్ ఇచ్చి ఈ ఫోటోను షేర్ చేశాడు బన్నీ. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ గా మారింది. లైకులు, రీ ట్వీట్ లతో ఐకాన్ స్టార్ అభిమానులు హోరెత్తిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు