NTR 30 : త్వరలో సెట్స్ పైకి

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన‌ ఆర్ఆర్ఆర్ సినిమా సూప‌ర్ హిట్ సాధించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ సినిమాతో దేశ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్నారు ఎన్టీఆర్‌. కొరటాల‌-ఎన్టీఆర్ కాంబోలో వ‌చ్చే ‘ఎన్టీఆర్ 30’ సినిమాపై అభిమానులు భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. ఇటీవ‌లే ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఒక మాస్ పోస్ట‌ర్ గ్లింప్స్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఈ సినిమా ఎప్పుడు విడుద‌ల‌వుతుందా అని నంద‌మూరి అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎన్టీఆర్ పాన్ ఇండియా క‌థ‌తో సినిమా చేయాల‌నుకుంటున్నారు. ఈ త‌రుణంలోనే అంత‌కు ముందు అనుకున్న క‌థ‌ను ప‌క్క‌కు పెట్టి పూర్తిగా కొత్త క‌థ‌తో ముందుకు వెళ్తున్న‌ట్టు తెలుస్తోంది. అందుకే ఈసినిమా సెట్స్ పైకి వెళ్ల‌డానికి ఆల‌స్య‌మైంద‌ని టాక్ వినిపిస్తోంది. ఎట్ట‌కేల‌కు తాజాగా ఈ చిత్రం నుంచి ఒక అప్డేట్ అయితే వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌, డీఓపీ ర‌త్న‌వేలు, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ సాబు సిరిల్ భారీ స్థాయిలో ప్రీ ప్రొడ‌క్ష‌న్‌ని వేగ‌వంతం చేశారు. అతిత్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఎన్టీఆర్‌-కొర‌టాల కాంబినేష‌న్‌లో ఇది రెండో సినిమా. ఇప్ప‌టికే జ‌న‌తా గ్యారేజ్ సినిమాతో ఎన్టీఆర్ ఖాతా ఒక హిట్ ప‌డిన విష‌యం తెలిసిందే.

మ‌రోవైపు ‘ఎన్టీఆర్ 30’ సినిమా గురించి రోజుకో వార్త వినిపిస్తూనే ఇందులో క‌థానాయిక పేరు రోజుకొక‌టి వినిపిస్తోంది. మ‌రోవైపు రెండు రోజుల నుంచి సోష‌ల్ మీడియాలో ఆ ఒక్క‌టి అడ‌క్కు అనే టైటిల్‌ని ఖ‌రారు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఇదే టైటిల్‌తో రాజేంద్ర ప్ర‌సాద్ సూప‌ర్ హిట్ సినిమా వ‌చ్చిన విష‌యం తెలిసిందే.  మరోవైపు ఈ చిత్రాన్ని దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్టు సమాచారం. సుధాకర్ మిక్కిలినేని, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కేవ‌లం భార‌త్ లో మాత్ర‌మే కాకుండా చైనీస్‌, జ‌ప‌నీస్‌ల‌తో పాటు దాదాపు 9 విదేశీ భాష‌ల్లో కూడా ‘ఎన్టీఆర్ 30’ విడుద‌ల కాబోతున్న‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్లే ఈ సినిమా ఎప్పుడు విడుద‌ల‌వుతుందో వేచి చూడాలి మ‌రి.

- Advertisement -

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు