NS24 : ఫ్యామిలీ, యాక్షన్ నేపథ్యంలో..

హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను లైన్ లో పెట్టుకుంటున్న హీరో నాగ శౌర్య. ఈ యంగ్ హీరో నుంచి ఇటీవల వచ్చిన కృష్ణ వ్రింద విహారికి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. మంచి రివ్యూలు తెచ్చుకున్న తర్వాత నాగ శౌర్య ప్రస్తుతం మరో సినిమాకు సైన్ చేశాడు. ఈ సినిమాను తాజాగా అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు ఎస్. ఎస్ అరుణాచలం దర్శకత్వం వహించిస్తున్నాడు.

అలాగే వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం 1గా శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి ఈ NS24 ను నిర్మించనున్నారు. కుటుంబ నేపథ్యంతో పాటు యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రాబోతుంది. నాగ శౌర్యకు తగ్గట్టుగా ఎస్. ఎస్ అరుణాచలం స్టోరీని సిద్ధం చేసినట్టు ఆయన చెప్పుకొచ్చాడు.

అలాగే ఈ కొత్త సినిమాలో నాగ శౌర్య పాత్ర విభిన్నంగా ఉండబోతుందని తెలుస్తుంది. కాగా ఈ సినిమా గురించి పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. మరి ఈ కొత్త చిత్రం నాగ శౌర్య కెరీర్ లో మరో కృష్ణ వ్రింద విహారి లాంటి హిట్ అవుతుందో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు