Extra Ordinary Man First Review: “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” ఫస్ట్ రివ్యూ

యంగ్ హీరో నితిన్ తాజా చిత్రం “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” మూవీకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చింది. చాలా కాలం నుంచి హిట్ గురించి ఎదురు చూస్తున్న నితిన్ ఈ సినిమా పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఫస్ట్ రివ్యూ ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నితిన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్”. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 8న థియేటర్లలోకి రానుంది. మోస్ట్ వాంటెడ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ కీలకపాత్రలో నటిస్తున్నారు. “నా పేరు సూర్య మూవీ”తో డైరెక్టర్ గా మారిన వక్కంతం వంశీ ఫస్ట్ మూవీతోనే ప్లాఫ్ అందుకున్నాడు. “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” డైరెక్టర్ వక్కంతం వంశీ రెండవ చిత్రం కావడం గమనార్హం. సినిమాలో నటించిన హీరో హీరోయిన్లతో పాటు, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ హ్యారీష్ జయరాజ్ కూడా ఈ మూవీ పైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు వీరందరూ. కానీ సినిమాపై అంచనాలే కావలసినంతగా పెంచలేకపోయారు మేకర్స్.

ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులకు స్పెషల్ షోలు వేశారట “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” మూవీ టీం. దీంతో మూవీ ఎలా ఉందన్న విషయం రిలీజ్ కు ముందే బయటకు వచ్చేసింది. ఆ టాక్ ప్రకారం “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” మూవీ ఫస్ట్ హాఫ్ హిలేరియస్ గా ఉందట. కానీ సెకండ్ హాఫ్ విషయానికి రాగానే కాస్త బోరింగ్ గా అనిపిస్తుందట. అయితే ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి ఫస్ట్ రివ్యూనే పాజిటివ్ గా ఉండడంతో ఈసారి నితిన్ హిట్ కొట్టడం పక్క అంటున్నారు సినీ విశ్లేషకులు.

- Advertisement -

ఇక సినిమాపై అంచనాలు తక్కువగా ఉండడం కూడా నితిన్ కు ప్లస్ పాయింట్ అవుతుంది. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీకి ‘యానిమల్’ ఫీవర్ పట్టుకుంది. ఇది చాలదు అన్నట్టుగా “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” మూవీ రిలీజ్ కు ఒక రోజు ముందే నాని “హాయ్ నాన్న” అంటూ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అయితే ఈ రెండు సినిమాలు వేర్వేరు జోనర్లలో రాబోతున్నప్పటికీ, ప్రేక్షకుల ఓటు ఎవరికి పడుతుందనేది వేచి చూడాలి. ఏదైతేనేం నితిన్ తో పాటు ఆయన టీంకు కూడా ఈ మూవీ హిట్ కావడం చాలా ముఖ్యం కాబట్టి “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుందాం.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు