Janhvi Kapoor: ఆ విషయంలో తారక్ బాగా నచ్చేసాడు: జాన్వి కపూర్

అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ గురించి సౌత్ ఇండియా ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. దివంగత నటి శ్రీదేవికి తెలుగు వారి హృదయంలో ఉన్న చోటు చాలా అపురూపమైంది. ఇప్పుడు శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ బాలీవుడ్ లో ధడక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుసగా పలు సినిమాలు, లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసుకుంటూ వస్తుంది. అయితే జాన్వికి ఇప్పటివరకు ఒక్క కమర్షియల్ హిట్ కూడా లేకపోవడంతో ఇంకా స్టార్ హీరోయిన్ కాలేదని చెప్పొచ్చు.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రం నుండి ఇప్పటికే జాన్వి కపూర్ ఫస్ట్ లుక్ కూడా మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ చిత్రంలో జాన్వి మత్స్యకారుల కుటుంబానికి చెందిన అమ్మాయిగా కనిపించనుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వి.. జూనియర్ ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

“నాకు దేవర సెట్స్ ని వదిలి వెళ్లాలని అనిపించదు. షూటింగ్ పూర్తి కాగానే అప్పుడే వెళ్ళిపోవాలా..? ఇంకాసేపు ఇక్కడే ఉంటే బాగుండు అనిపించేది. నేను ముందు నుంచి తారక్ అభిమానిని. ఆయనతో నాకు మంచి స్నేహం ఏర్పడింది. షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ తన తోటి నటీనటులతో ఎంతో సరదాగా ఉంటారు. ఆయనలోని ఈ క్వాలిటీ నాకు బాగా నచ్చింది. ఇటీవల నాతో పలు సన్నివేశాలను చిత్రీకరించారు. అప్పుడు సెట్ లో తారక్ లేరు. నేను చాలా లోన్లీగా ఫీలయ్యాను. ప్యాకప్ చెప్పగానే నిరాశతో ముంబైకి తిరిగి వెళ్ళిపోయాను” అంటూ జాన్వి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు