యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఈ యంగ్ హీరో ఈ సంవత్సరం మూడు సినిమాల్లో కనిపించి ఆడియన్స్ ను అలరించాడు. ప్రస్తుతం నాగ చైతన్య మరో సినిమా చేస్తున్నాడు. తమిళ సినీ పరిశ్రమలో సక్సెస్ఫుల్ దర్శకుడిగా కొనసాగుతున్న వెంకట ప్రభు దర్శకత్వం NC 22 అనే సినిమా చేస్తున్నాడు.
అయితే ఇవాళ అక్కినేని నాగచైతన్య పుట్టినరోజు. ఈ సందర్భంగా అతని తాజా చిత్రం టైటిల్ ను ఖరారు చేశారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రంతో తొలిసారి చైతు కోలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు. ప్రముఖ తమిళ దర్శకుడు వెంకట ప్రభు తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు “కస్టడీ” అనే పేరు పెట్టారు. ఏ.శివ అనే పోలీస్ ఆఫీసర్ గా నాగచైతన్య నటిస్తున్నాడు. ఈ రోజు విడుదల చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.
Read More: Lokesh kanagaraj: రెండ్రోజులు రెండొందలు.. లియో రచ్చ
ఫెరోషియస్ గా ముందుకు పోతున్న నాగచైతన్యను పోలీసులు అందరూ పట్టుకుని ఆపుతున్నారు. అంతేకాదు కదిలితే కాల్చేస్తామన్నట్టుగా తుపాకులు గురి పెట్టారు. మరి ఓ పోలీస్ ఆఫీసర్ కు ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదురైందనేది ? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. మాస్ కు కావాల్సినంత యాక్షన్ సీన్స్ ఇందులో ఉంటాయని దర్శకుడు వెంకట్ ప్రభు ఈ పోస్టర్ తో చెప్పకనే చెప్పేశాడు. అరవిందస్వామి ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా చేస్తోంది.
Read More: Allu Arjun: విమర్శలు నుండి నేషనల్ అవార్డ్ వరకు
హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌదరి మనవడు,...
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...