Sailesh Kolanu : హిట్ యూనివర్స్ కు భారీ ప్లాన్

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా అడుగుపెట్టి హీరో స్థాయి వరకు రావడం.. ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడం అంటే సాధ్యం కాదనే చెప్పాలి. కానీ చిరంజీవి, రవితేజ, నాని వంటి స్టార్ హీరోలు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. అలాంటి వారి జాబితాలోనే అడివి శేష్ ఒకరు. కమర్షియల్ అంశాలని, మాస్ ఇమేజ్ అని ఒక ధోరణిలోనే కాకుండా ప్రతి సినిమాకి తన సొంత ఆలోచనలతో చాలా నమ్మకంగా సినిమా చేస్తూ.. ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు.

ఇక ప్రస్తుతం అడివి శేష్ “హిట్ ది సెకండ్ కేస్” అనే మూవీలో హీరోగా నటించాడు. ఈ చిత్రం డిసెంబర్ 2వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. అయితే మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడంతో అడవి శేష్ ఈ మూవీకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ” హిట్ 2 మూవీలో హిట్ 3 మూవీలోని హీరోని పరిచయం చేశాము. అది థ్రిల్లింగ్ మూమెంట్ గా ఉంటుంది. అలాగే ఈ సినిమాలో కిల్లర్ ఎవరు అనేది చాలా సస్పెన్స్ గా ఉంటుంది” అంటూ అడివి శేష్ చెప్పుకొచ్చాడు.

అయితే మూడో భాగం మాత్రం భారీ మల్టీస్టారర్ గా ప్లాన్ చేస్తున్నారట. ఇందులో అడవి శేష్ తో పాటు నానికి కూడా కీలకపాత్ర ఉండబోతుందని సమాచారం. అలాగే విజయ్ సేతుపతి కి కూడా మంచి రోల్ ఉంటుందట. పైగా ఈ మూడవ భాగం షూట్ మొత్తం అమెరికా బ్యాక్ డ్రాప్ లో జరగనుందని సమాచారం. హిట్ 1, హిట్ 2 ను లోకల్ గా ప్లాన్ చేసిన డైరెక్టర్ శైలేష్ కొలను.. హిట్ 3ని ఇంటర్నెషనల్ రేంజ్ లో తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు