HIT2 : కోడి బుర్ర నేరస్థుడు మర్డర్స్ చేస్తే..

యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను హిట్ సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ యూనివర్స్ లో ఇప్పటికే హిట్ : ది ఫస్ట్ కేస్ అని విశ్వక్ సేన్ తో తెరకెక్కించాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతోో ఇప్పుడు అడివి శేష్ తో హిట్ : ది సెకండ్ కేస్ ను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. డిసెంబర్ 2న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా మెప్పించాయి. ఇప్పుడు తాజాగా మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ విడుదల కోసం కూడా నిర్మాత నేచురల్ స్టార్ నాని, హీరో అడివి శేష్ ప్రమోషన్స్ చేశారు. దీంతో ట్రైలర్ పై కూడా అభిమానుల నుంచి అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. మరీ ఈ రోజు రిలీజ్ అయిన ట్రైలర్ అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.

ట్రైలర్ ప్రారంభంలో.. “జనరల్లి.. క్రిమినల్స్ ఆర్ వేరీ డమ్.. కోడి బుర్రలు.. ఐదు నిమిషాలు చాలు వీళ్లను పట్టుకోవడానికి” అంటూ హీరో అడివి శేష్ ఒక డైలాగ్ చెబుతాడు. ఈ డైలాగ్ తో సినిమాలో క్రిష్ణ దేవ్ పాత్ర గురించి పరిచయం చేశారు. అతను ఒక నిజాయితి, పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అని తెలుస్తుంది. అలాంటి పోలీస్ అధికారికి ఒక మిస్టరీ మర్డర్ కేసు వస్తుంది. దాన్ని క్రిష్ణ దేవ్ ఎలా ఛేదించాడు ? మర్డర్ ను చేసింది ఎవరు ? వారి మోటీవ్ ఏంటి ? క్రిష్ణ దేవ్ ను కోడి బుర్ర గల సైకో కిల్లర్ ఎందుకు టార్గేట్ చేశాడు ? అనే ప్రశ్నలను ఈ ట్రైలర్ ద్వారా ప్రేక్షకుల ముందు ఉంచాడు డైరెక్టర్ శైలేష్ కొలాను.

- Advertisement -

హిట్ 2 నుంచి కొన్ని రోజుల ముందు ఒక టీజర్ వచ్చింది. ఈ టీజర్ లో దారుణమైన వైలెన్స్ ఉండేది. దీంతో యూట్యూబ్ ఈ టీజర్ ను తొలగించింది. ఇప్పుడు అలాంటి పొరపాట్లు లేకుండా ట్రైలర్ ను చక్కగా కట్ చేశారు. సినిమాలో వైలెన్స్ స్థాయి భారీగానే ఉంది అన్నట్టు చూపిస్తూ.. ఆ వైలెన్స్ సీన్స్ ను ట్రైలర్ లో కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. అలాగే జాన్ స్టీవర్ట్ ఎడూరి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది.

మొత్తంగా అయితే ట్రైలర్.. సినిమాపై అంచనాలను, ఆసక్తిని పెంచుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు