NBK108: బాలయ్య సినిమాలో శ్రీముఖి..?

ఈ ఏడాది విరసింహారెడ్డి చిత్రంతో సంక్రాంతి బరిలోకి దిగిన నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలకృష్ణ వింటేజ్ లుక్ లో కనిపించి అదరగొట్టేశాడు. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య (NBK 108) ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ భార్య పాత్రలో కాజల్ అగర్వాల్ కనిపించబోతోంది. వీరిద్దరి కూతురి పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీ లీల నటిస్తోంది. షైన్ స్క్రీన్స్ పతాకం పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఎస్ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతున్నట్లు ఇప్పటికే దర్శకుడు తెలియజేశాడు. అయితే తాజాగా ఈ మూవీలో ఓ ముఖ్యమైన పాత్ర గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమాలో యాంకర్ శ్రీముఖి ఒక ముఖ్యమైన పాత్రను పోషించనుందనేది టాక్. ఈ చిత్రంలో బాలయ్య కూతురుగా శ్రీ లీల నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆమెకి ఫ్రెండ్ పాత్రలో శ్రీముఖి కనిపించనుందని అంటున్నారు. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఈ పాత్ర తెరపై కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ చిత్రం దసరాకి విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఇక త్వరలోనే శ్రీముఖి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననుందని సమాచారం.

- Advertisement -

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు