NBK108: హీరో ఎవరైనా సరే… బాలయ్య సినిమాలో మాత్రం విలనే..

నందమూరి బాలకృష్ణ జోరు మీదున్నాడు. అఖండ, వీరసింహరెడ్డి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్న బాలయ్య తన తదుపరి మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. బాలయ్య 108వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీ లీల బాలయ్య చెల్లెలిగా నటిస్తుంది. గ్యాప్ లేకుండా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ లో ప్రముఖ బాలీవుడ్ నటుడు “అర్జున్ రాంపాల్” విలన్ గా నటిస్తున్నట్టు చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసింది. అతను హిందీలో మోక్ష, దివానపన్, అసంభవ్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా, ఇంకా పలు సినిమాల్లో ముఖ్య పాత్రలు చేసాడు. ఇప్పుడు తొలిసారిగా తెలుగులో అదీ బాలయ్య సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.

అయితే బాలయ్య సినిమాల్లో హీరోలు విలన్లు గా నటించడం కొత్తేమి కాదు. ఇంతకు ముందు చాలా మంది హీరోలు ఆయనతో నటించారు. 2014 లో వచ్చిన లెజెండ్ సినిమాలో జగపతి బాబు విలన్ గా నటించారు. విలన్ గా ఇదే ఆయనకు తొలి సినిమా. ఆ తర్వాత డిక్టేటర్ సినిమాలో నటించిన “నవాబ్ షా” కూడా పలు హిందీ సినిమాల్లో హీరోగా చెసాడు. ఆ తర్వాత 2021 లో అఖండ సినిమాలో మంచి లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న శ్రీకాంత్ ని విలన్ ని చేసారు. ఇక రీసెంట్ గా వచ్చిన వీరసింహారెడ్డిలో కూడా కన్నడలో స్టార్ హీరో అయిన దునియా విజయ్ విలన్ గా నటించాడు. ఓవరాల్ గా హీరో ఎవరైనా సరే బాలయ్య తో మూవీ చేస్తే మాత్రం వాళ్ళు విలనే అని ఫిక్సవ్వాల్సి వస్తుంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు