టాలీవుడ్ తో పాటు సౌత్ లో ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీల్లో ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోయిన్ ఎవరు అంటే.. సమాధానం నయనతార అనే వస్తుంది. 2003లో సినిమా కెరీర్ ను ప్రారంభించిన నయనతార అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అంతే కాదు.. మూడేళ్లలోనే సౌత్ లో దర్శక నిర్మాతలకు మొదటి ఆప్షన్ గా నిలిచింది. ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతోంది.
డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ప్రేమ పెళ్లి తర్వాత కూడా సినిమాలకు బ్రేక్ ఇవ్వకుండా వరుసగా సినిమాలు చేస్తూ, ప్రేక్షకులకు దగ్గర గానే ఉంటుంది. ఈ లేడీ సూపర్ స్టార్ 20 ఏళ్ల సినిమా కెరీర్ లో చాలా సాధించింది. కానీ బాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా చేయలేదనే లోటు మాత్రం నయనతారతో పాటు ఆమె ఫ్యాన్స్ కు కూడా ఉంది. అందుకే.. బాలీవుడ్ లో నయనతార తన మొదటి సినిమా చేయబోతుంది.
Read More: Kajal Agarwal: కదనరంగాన కాలుమోపిన “సత్యభామ”…
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఒక సినిమా చేస్తున్న సంగతి విధితమే. ఈ చిత్రానికి జవాన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రలో నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. తన బాలీవుడ్ మొదటి సినిమాపై ఈ లేడీ సూపర్ తాజాగా స్పందించింది.
“ఇన్ని రోజులు సరైన అవకాశం రాకపోవడం వల్లే నేను బాలీవుడ్ లో సినిమా చేయలేదు. ఇంకా చెప్పాలంటే గతంలో సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఇంత అనుకూలంగా లేవు. ప్రస్తుతం కాలం మారింది. పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ వల్ల నటీ నటుల సినిమాలు అన్ని భాషల్లో విడుదల అవుతున్నాయి. దీంతో వారి నటన గురించి పాన్ ఇండియా ప్రేక్షకులకు తెలుస్తోంది. అలాగే అవకాశాలు కూడా వస్తున్నాయి. ప్రతి దానికీ సరైన సమయం ఉంటుంది. నా బాలీవుడ్ ఎంట్రీకి కూడా ఇదే సరైన సమయం అని భావిస్తున్నాను” అంటూ నయనతార చెప్పుకొచ్చింది.
Read More: Pooja Hegde: ఇక బుట్టబొమ్మ కథ ఎండ్ అయినట్టేనా?
హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌదరి మనవడు,...
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...