HBD Nani: నాని జీవితం..ఎందరికో ఆదర్శం..!

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి ఎటువంటి సపోర్టు లేకుండా వచ్చి స్టార్ హీరోలుగా ఎదిగిన వారిలో నేచురల్ స్టార్ నాని కూడా ఒకరు.. నాని హీరోగా కెరియర్ ని మొదలుపెట్టడం వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయని కూడా చెప్పవచ్చు.. నాని ఎదిగిన తీరు చాలామందికి స్ఫూర్తిదాయకం.. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా కేవలం హార్డ్ వర్క్, టాలెంట్ తో సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఈ రోజున తన 40వ బర్త్ డే సందర్భంగా నాని గురించి పలు విషయాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

నాని కృష్ణాజిల్లాలో పుట్టినప్పటికీ తన చదువును మొత్తం హైదరాబాదులో పూర్తి చేశారు. సినిమాల మీద మక్కువతో డైరెక్టర్ అయిపోవాలని కలలు కంటూ చదువును మధ్యలోనే ఆపి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ముందు పని నేర్చుకోవాలి కాబట్టి సినిమా షూటింగ్ సెట్లలో ఎలాంటి పనులు చెప్పినా చేసేవారట ముఖ్యంగా క్లబ్ బోర్డు పట్టుకొని తిరుగుతూ ఉండేవారు. కాస్త అనుభవం వచ్చాక అసిస్టెంట్ డైరెక్టర్ గా మారి డైరెక్టర్ బాపు, శ్రీనువైట్ల వంటి దర్శకుల దగ్గర కూడా పనిచేశారు.

అయితే అనుకోకుండా హీరోగా ఎందుకు కాకూడదనే ఆలోచన తన మనసులో మెదిలింది. అప్పుడు డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రకంటి డైరెక్షన్లో.. అష్టా చమ్మ సినిమాతో హీరోగా మారారు. 2008లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది. ఆ తర్వాత స్నేహితుడు అనే చిత్రంతో మరో విజయాన్ని అందుకున్నారు. కానీ నాని కెరియర్ ను మార్చింది మాత్రం అలా మొదలైంది సినిమానే. ఆ తర్వాత పిల్ల జమిందార్, భీమిలి కబడ్డీ జట్టు ఇలా ఎన్నో చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు. అలా ఏకంగా రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాలో అవకాశాన్ని అందుకున్నారు నాని.

- Advertisement -

నాని కెరియర్లో భలే భలే మగాడివోయ్, జెంటిల్ మేన్ చిత్రాలతో ఒక్కసారిగా తన మార్కెట్ ను పెంచేసుకున్నారు. హీరోగా తన సినీ ప్రస్థానాన్ని 17 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ తనదైన డైలాగులతో బాడీ లాంగ్వేజ్ తో ఎన్నో చిత్రాలను సక్సెస్ చేశారు. నాని పుట్టినరోజున అభిమానులు సైతం పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది హాయ్ నాన్న సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు నాని. ఇప్పుడు ఒకవైపు హీరోగా.. మరో వైపు నిర్మాత గా కూడా వ్యవహరిస్తూ దూసుకుపోతున్నారు..

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు