Maheshbabu Remuneration: సెకన్ కి కోటి..మహేష్ రేంజ్ అంటే ఇంతే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు బిజినెస్ తో పాటూ పలు రకాల బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తూ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా కూల్ డ్రింక్ , మొబైల్ ఫోన్స్, సంతూర్ సోప్స్ ఇలా ఎన్నో రకాల యాడ్స్లను ప్రమోట్ చేస్తూ భారీగానే సంపాదిస్తున్నారు.. తాజాగా ఇప్పుడు మరొక కంపెనీ తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు మహేష్ బాబు. ఇందులో భాగంగా డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్ పే కు తమ వాయిస్ ను అందించారు.

ఇందుకు సంబంధించిన ఒక వీడియో గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా ఈ వీడియోను ఫోన్ పే ని రిలీజ్ చేసింది. కేవలం ఐదు సెకండ్లకు మాత్రమే మహేష్ బాబు ఇందుకు వాయిస్ అందించారు.. ఐదు సెకండ్ల వాయిస్ కోసం ఎవరు ఊహించని విధంగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయం విన్న అటు అభిమానులు సినీ సెలబ్రిటీలు కూడా ఒక్కసారిగా షాక్ కి గురవుతున్నారు..

ఫోన్ పే ద్వారా ఎవరైనా 100 రూపాయలు ఫోన్ పే చేస్తే.. ఇప్పుడు వంద రూపాయలు ఫోన్ పే ద్వారా వచ్చాయి.. హ్యాట్సప్ గురువుగారు అంటూ ఒక వాయిస్ మనం వినవచ్చు.. అయితే ఈ ఐదు సెకండ్ల వాయిస్ కోసం మహేష్ బాబుకి ఏకంగా రూ .5 కోట్లు ఫోన్ పే సంస్థ చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ విషయం విన్న నెటిజెన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. దీన్నిబట్టి చూస్తే సెకన్ కు కోటి రూపాయలు మహేష్ తీసుకుంటున్నారా అన్నట్టు నోరేళ్ల పెడుతున్నారు.

- Advertisement -

మహేష్ సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాని విడుదల చేయగా ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో పరవాలేదు అనిపించుకుంది. ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళితో తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు. అందుకు సంబంధించి పలు రకాల కసరత్తులు కూడా చేస్తున్నారు. మహేష్ బాబు సినిమాలలోనే కాకుండా ఎంతోమంది చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉచితంగా చేయిస్తూ పలు రకాల స్వచ్ఛంద సేవా సంస్థలకు కూడా భారీ మొత్తంలోనే విరాళాలు చెల్లిస్తూ మంచితనాన్ని నిరూపించుకుంటున్నారు. ఏది ఏమైనా మహేష్ బాబు తీసుకునే పారితోషకం చూసి ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోతోంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు