Nani : ముగ్గురు మొనగాళ్లతో..

Hit-The Second Case సినిమాతో మరొక సారి తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు డైరెక్టర్ శైలేష్ కొలను. ఇప్పటికే హిట్1 తో తను ఎంటో చూపించిన శైలేష్.. మరోసారి తన దర్శకత్వం మరియు స్టోరీ లైన్ తో ప్రేక్షకులని మెప్పించాడు. అడవి శేష్ హీరోగా తెరకెక్కిన Hit 2 తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. క్రైమ్ థ్రిల్లర్ గా సాగే ఈ చిత్రం మంచి వసూళ్లని రాబడుతుంది. సినిమా రిలీజ్ అయిన మూడో రోజుకే ‘బ్రేక్ ఈవెన్’ అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

నాని తన ప్రొడక్షన్ హౌస్ ‘వాల్ పోస్టర్ సినిమాస్’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించాడు. Hit-The Second Case క్లైమాక్స్ లో నాని ని అర్జున్ సర్కార్ అనే పాత్రతో పరిచయం చేసిన సంగతి తెలిసిందే. హిట్ 3లో అర్జున్ సర్కార్ పాత్రతో నాని ఒక కేసును ఛేదిస్తాడు అని సినిమాలనే అధికారికంగ ప్రకటించారు. దీంతో హిట్ 3పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి.

అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తిరమైన వార్త వినిపిస్తుంది. Hit 3ని డైరెక్టర్ శైలేష్ ముగ్గురు హీరోలతో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. అందులో ఒకటి అర్జున్ సర్కార్ పాత్ర ఇప్పటికే ఫైనల్ అయింది. దీంతో పాటు Hit-The first Caseలో విక్రమ్ పాత్రలో నటంచిన విశ్వక్ సేన్, Hit-The Second Caseలో కృష్ణ దేవ్ [KD] పాత్రలో నటంచిన అడవి శేష్ కూడా ఉండబోతున్నారని టాక్.

- Advertisement -

ఈ ముగ్గురు హీరోలు కలిసి ఒక కేసును ఛేదించేలా డైరెక్టర్ శైలేష్ కొలను స్టోరీని సిద్ధం చేశాడని సమాచారం. దీంతో హిట్3 పై విపరీతమైన హైప్ క్రియేట్ అవుతోంది. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే.. మూడో పార్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు