Dil Raju : ప్రాణం పెట్టి తీస్తే హిట్ రిజల్ట్ వస్తుంది

‘మళ్ళీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌‌లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రంతో సాయికిరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేశారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. నవంబర్ 18న మసూద ప్రపంచవ్యాప్తంగా విడుదలై విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సంద్భంగా రామానాయుడు స్టూడియో లో థాంక్యూ మీట్ ను జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి దిల్ రాజు, హీరో సుమంత్, సుహాస్ డైరెక్టర్ సందీప్ రాజ్,శుభలేఖ సుధాకర్‌తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. రాహుల్ యాదవ్ టేస్ట్ కు తగ్గట్టు కథను, దర్శకుడు గౌతమ్ ను సెలెక్ట్ చేసుకొని “మళ్ళీ రావా” సినిమా చేసి హిట్ కొట్టాడు, ఆ తరువాత “ఏజెంట్ ఆత్రేయ” సినిమా తీసి మళ్ళీ హిట్ కొట్టి, ఇప్పుడు దర్శకుడు సాయి కిరణ్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టడం అనేది గ్రేట్ .ఒక నిర్మాత ప్రేక్షకుల టేస్ట్ కు తగ్గట్టు సినిమా తియ్యాలి అనుకుని, మంచి సంకల్పంతో సినిమాకు ప్రాణం పెట్టి తీస్తే హిట్ రిజల్ట్ వస్తాయి అని ఈ జనరేషన్ లో రాహుల్ ప్రూవ్ చేశాడు. రాహుల్ తన బ్యానర్ లో ఇలాంటి మంచి సినిమాలు చాలా తియ్యాలని కోరుకుంటూ చిత్ర యూనిట్ అందరికీ అల్ ద బెస్ట్ అన్నారు.

హీరో సుమంత్ మాట్లాడుతూ.. రాహుల్ తో గత ఆరు సంవత్సరాలనుండి జర్నీ చేస్తున్నాను. తన బ్యానర్ లో మెదటి సినిమా “మళ్ళీ రావా” చేశాను. ఆ సినిమా నాకు మంచి పేరు తీసుకువచ్చింది. చాలా రోజుల తర్వాత రియలిస్టిక్ హారర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి హ్యాట్రిక్ హిట్ సాధించిన రాహుల్ కు కంగ్రాట్స్ తెలియ జేస్తున్నాను.

- Advertisement -

నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ..ఈ సినిమా విడుదలైన మూడో వారంలో కూడా మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు బిగ్ థాంక్స్. నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ మా నాన్నే. తన దగ్గర నుండే హార్డ్ వర్క్ ఎలా చెయ్యాలో నేర్చుకొన్నాను.తనే నన్ను ముందుండి నడిపించాడు.ఇలా నా ఫ్యామిలీ అందరూ నాకు ఫుల్ సపోర్ట్ చేయడం వలెనే మూడు సినిమాలు బిగ్ హిట్స్ అయ్యాయి. వారి సపోర్ట్ లేకపోతే నేను ఈ రోజు ఈ స్టేజ్ మీద ఉండేవాన్ని కాను. ఈ సినిమాకు తిరువీర్ కరెక్ట్ యాప్ట్ అని సెలెక్ట్ చేసుకున్నాము. నిజంగా తను చాలా హార్డ్ వర్కర్. ఎన్ని హర్డిల్స్ వచ్చిన తట్టుకొని ఈ సినిమా కోసం గత మూడు సంవత్సరాలుగా ఏ సినిమా చేయకుండా మాతో జర్నీ చేస్తున్నాడు.
చిత్ర దర్శకుడు సాయి కిరణ్ మాట్లాడుతూ.. ఏ సినిమాకైనా కథతో పాటు మంచి నటీనటులు , టెక్నిషియన్స్ చాలా అవసరం. అయితే ఈ సినిమాకు నిర్మాత రాహుల్ తనే సెలెక్ట్ చేసుకొని సినిమాటోగ్రఫీ పరంగా, మ్యూజిక్ పరంగా, ఆర్ట్ డైరెక్షన్, ఎడిటర్ ఇలా నాకు అద్భుతమైన టెక్నిషియన్స్ ను ఇచ్చాడు. మా “మసూద” సినిమాను ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు అన్నారు.

సీనియర్ నటులు శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ..ఈ సినిమాలో దర్శక, నిర్మాతలు నాకు మంచి పాత్ర ఇచ్చారు. ఇంతటి మంచి సినిమాకుమెయిన్ పిల్లర్స్ నలుగురే. వారే దర్శక, నిర్మాతలు, తిరువీర్, సంగీత, అఖిల ముఖ్య కారణం.

చిత్ర హీరో తిరువీర్ మాట్లాడుతూ.. ఇలాంటి రోజు వస్తుందని లైఫ్ లో అనుకోలేదు. నా లైఫ్ లో ఈ నవంబర్ మంత్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

నటుడు సత్యం రాజేష్ మాట్లాడుతూ.. తిరువీర్ సినిమాలోనే కాకుండా ఒరిజినల్ గా కూడా చాలా మంచోడు. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

నటి సురభి మాట్లాడుతూ.. మాది సురభి నాటకాల కుటుంబం. ఒక చిన్న ఫ్యామిలీ లవ్ స్టోరీ చేశాను.ఒక చిన్న ఆర్టిస్ట్ కు ఒక సినిమాలో ఛాన్స్ దొరకడమే అదృష్టం.

మసూద పాత్రలో నటించిన అఖిల మాట్లాడుతూ. ఇలాంటి మంచి సినిమాలో టైటిల్ రోల్ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఎప్పుడూ గుర్తుండి పోతుంది.

నటి బాందవి మాట్లాడుతూ.. తిరువీర్, సంగీత , శుభలేఖ సుధాకర్ వంటి పెద్ద వారితో కలసి చేయడం చాలా సంతోషం గా ఉంది. స్వదర్మ్ ఫ్యామిలీ లో మెంబెర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు