Dhamaka : దండ కడియాల్..

తెలుగు ప్రేక్షకుల్లో జోష్ నింపేందుకు “ధమాకా” మూవీతో రవితేజ రెడీ అవుతున్నారు. రవితేజ మార్క్ కామెడీ, యాక్షన్ అంశాలతో మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజకు జోడిగా యంగ్ హీరోయిన్ శ్రీ లీల నటిస్తోంది. పెళ్లి సందడితో కథానాయకగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీలకు ఇది రెండో సినిమా. ప్రసన్న కుమార్ బెజవాడ కథను అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ధమాకా సాంగ్ ఆడియన్స్ ను అలరించి సినిమాపై అంచనాలను పెంచేసాయి. అయితే, తాజాగా మాస్ మహారాజా రవితేజ చిత్రం ‘ధమాకా’ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలోని ‘దండ కడియాల్ ‘ సాంగ్ కు సంబంధించి లిరికల్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీకి బీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించాడు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్‌ మంచి హిట్‌ అందుకున్నాయి. ఇక ఇప్పుడు ‘దండ కడియాల్ ‘ సాంగ్ మంచి టాక్‌ తెచ్చుకునేలా కనిపిస్తోంది. దీనికి బ్యా గ్రౌండ్‌ మ్యూజిక్‌ అలాగే, లిరిక్స్‌ బలం చేకూర్చనున్నాయి. ఈ ఫుల్‌ సాంగ్‌ ఎప్పుడు రిలీజ్‌ చేస్తారో చిత్ర బృందం చెప్పలేదు. మరో రెండు రోజుల్లో రిలీజ్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. కాగా ఈనెల 23న “ధమాకా” మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లలో రిలీజ్ కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు