Naga Chaitanya: అక్కినేని ఫ్యామిలీ భారాన్ని మోస్తున్న నాగచైతన్య

Naga Chaitanya: యువ సామ్రాట్, స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. అక్కినేని నాగార్జున నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగ చైతన్య.. నటుడిగా అంచలంచెలుగా ఎదుగుతున్నారు. జోష్ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు చైతు. తొలి సినిమాతోనే తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. 2010లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఏం మాయ చేసావే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.

ఆ తర్వాత 100% లవ్, మజిలీ వంటి సినిమాలతో సక్సెస్ఫుల్ హీరోగా మారిపోయాడు. ఇటీవల దూత వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన నాగచైతన్య.. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమాతో థియేటర్లలోకి రాబోతున్నాడు. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు నాగ చైతన్య. ఈ సినిమా హిట్ తో తన క్రేజ్ ని మరింత పెంచుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. మరి ఈసారి నాగచైతన్య అనుకున్నట్లుగా హిట్టు పడుతుందా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అయితే చైతు సోదరుడు అఖిల్ తో పోల్చుకుంటే ఈయన కొంతవరకు బెటర్ అనే చెప్పాలి. అఖిల్ తన కేరిర్ లో ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క హిట్ కొట్టలేకపోయాడు. చైతు మాత్రం అప్పుడప్పుడు సక్సెస్ లతో పడుతూ లేస్తూ కొనసాగుతున్నారు. దీంతో నాగర్జున తర్వాత ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ముందుకు వెళుతున్న హీరో అంటే నాగచైతన్య అనే చెప్పాలి. ఇలా అప్పుడప్పుడు హిట్ సినిమాలతో నాగచైతన్య అక్కినేని ఫ్యామిలీ భారాన్ని మోస్తున్నాడు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు