Mumtaz : చచ్చిపోవాలనుకున్న ప్రముఖ హీరోయిన్.. అసలేమైందంటే..?

Mumtaz : సాధారణంగా చాలామంది హీరోయిన్లు అవకాశాలు రాక బాధపడుతుంటే ఈమె మాత్రం అసలు అలాంటి పాత్రలు ఎందుకు చేశానా అంటూ బాధపడుతోంది.. తాజాగా కన్నీళ్లు పెట్టుకుంది.. అంతే కాదు ఒకానొక సమయంలో చచ్చిపోవాలని కూడా అనుకుందట ..మరి ఆ హీరోయిన్ ఎవరు? ఎందుకు ఆమెకు ఇంత కష్టం వచ్చింది? అసలు ఆమె చేసిన పాత్రలేంటి? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.. ఆమె ఎవరో కాదు ముంతాజ్.. అయితే ఈమె పేరు చెబితే చాలామంది గుర్తుపట్టరు కానీ ఫోటో చూస్తే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు..

అభిమానులను వేడుకుంటున్న ముంతాజ్..

ఎన్నో సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లో చేసి.. అందరి చేత వావ్ అనిపించుకుంది ముంతాజ్.. స్టార్ హీరోల సినిమాలలో మెరిసి.. తన అందంతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది. కానీ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ బాధపడుతోంది.. అసలు ఈమె ఇంతలా బాధపడడానికి గల కారణం ఏమిటంటే.. గ్లామర్ రోల్స్ లో నటించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవడమే. అయితే ఈ ఫోటోలను డిలీట్ చేయాలని ఆమె తెలిపింది. తన దగ్గర బోలెడంత డబ్బు ఉంటే వాటితో సోషల్ మీడియాలో ఉన్న తన గ్లామరస్ ఫోటోలను డిలీట్ చేయిస్తానని కూడా తెలిపింది ముంతాజ్ .. ఇక అది తన వల్ల కానీ పని అని తెలిసి.. దయచేసి తన అభిమానులు తన గ్లామర్ పిక్స్ షేర్ చేయవద్దని.. తాను చనిపోయినా సరే ఆ ఫోటోలు మాత్రం షేర్ చేయకండి అంటూ తెలుపుతోంది.. అయితే ఒకానొక సమయంలో ఈ ఫోటోలు షేర్ చేయడం వల్ల తాను చాలా ఇబ్బంది పడ్డానని తెలిపింది.

చనిపోవాలనుకున్నా..

తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. మున్ముందు ఏం జరుగుతుందో తెలియదు అంటూ ఎమోషనల్ అయింది.. ఒకరోజు నాకు ఉన్నట్టుండి విపరీతమైన నడుము నొప్పి వచ్చింది.. ఎటూ కదలలేకపోయాను.. ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగినా..ఆ నొప్పి మాత్రం తగ్గలేదు.. రెండేళ్లు ఆ నొప్పిని అలాగే భరించాను.. ఆ తర్వాత నాకు ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉన్నట్లు వైద్యులు తెలిపారు.. ఎన్నోరోజులు ఆ నొప్పులతో విలవిల్లాడిపోయానో నాకు మాత్రమే తెలుసు.. కీళ్ల నొప్పుల వల్ల కూర్చోలేక పోయాను . అలాగే నిలబడలేకపోయాను. శరీరాన్ని కదిలించడమే కష్టం అయ్యేది. ఇక బాగా డిప్రెషన్ కి లోనయ్యాను.. నొప్పితో పగలంతా ఏడ్చేదాన్ని.. నా కుటుంబం నాకు తోడుగా నిలబడలేదు.. దాంతో చచ్చిపోవాలనుకున్నాను అంటూ ఎమోషనల్ అయింది.ఇక వీటన్నింటినీ ఒక వీడియో రూపంలో షేర్ చేయడంతో అభిమానులు సైతం కన్నీటి పర్యంతమవుతున్నారు.

- Advertisement -

ముంతాజ్ సినిమాలు..

ముంతాజ్ ( Mumtaz ) నటించిన సినిమాల విషయానికి వస్తే.. అత్తారింటికి దారేది, జెమిని, కూలీ, కొండవీటి సింహాసనం, చాలా బాగుంది , తారీఖు, టామీ, ఆగడు వంటి ఎన్నో చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా నటించి మెప్పించింది. అలాగే తమిళ్ , మలయాళం, కన్నడ, భాషల్లో కూడా సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. ఏది ఏమైనా ముంతాజ్ ఒకప్పుడు గ్లామర్ రోల్స్ చేయడమే ఇప్పుడు ఆమెకు శాపంగా మారిందని చెప్పవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Mumtaz (@mumtaz_mumo)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు