Indian 2 Release Date : “ఇండియన్ 2” రిలీజ్ డేట్ ఫిక్స్… జూన్ పైనే శంకర్ కన్ను

Indian 2 Release Date : లెజెండరీ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం రెండు పడవల ప్రయాణం చేస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ మూవీని చేస్తూనే, మరోవైపు లోకనాయకుడు కమల్ హాసన్ తో ఇండియన్ 2ను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఇండియన్ 2 మూవీ రిలీజ్ డేట్ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఇండియన్ 2ను జూన్ లోనే తెరపైకి తీసుకురావడానికి శంకర్ సన్నాహాలు చేస్తున్నాడనే వార్త తాజాగా తెరపైకి వచ్చింది. అలాగే మరోవైపు గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ డేట్ ను కూడా శంకర్ ఫిక్స్ చేశాడని టాక్ నడుస్తోంది. మరి ఇంతకీ ఈ రెండు సినిమాలు ఎప్పుడూ తెరపైకి రాబోతున్నాయి? అనే వివరాల్లోకి వెళితే…

ఇండియన్ 2 జూన్ లోనే…

కమల్ హాసన్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఇండియన్ 2. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో ఎస్ జె సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, సిద్ధార్థ్, మధుబాల, బ్రహ్మానందం వంటి ప్రముఖ నటీనటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిది స్టాలిన్, సుభాస్కరన్ ఇండియన్ 2 మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించబోతున్నారు.

ఈ మూవీతో పాటు గేమ్ ఛేంజర్ కూడా రిలీజ్ విషయంపై ముందు నుంచే డైలమా కొనసాగుతోంది. ఎట్టకేలకు ఈ క్రేజీ ప్రాజెక్టుల విడుదల విషయంలో డైరెక్టర్ శంకర్ ఒక క్లారిటీకి వచ్చాడనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఇండియన్ 2 మూవీని జూన్ 13న రిలీజ్ ( Indian 2 Release Date ) చేయడానికి రెడీ అవుతున్నారు చిత్ర బృందం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రక్కన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఇండియన్ తో పాటు ఇండియన్ 3 షూటింగ్ ను కూడా కంప్లీట్ చేశారు శంకర్, కమల్ హాసన్. ప్రస్తుతం ఇండియన్ 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుండగా, ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఇండియన్ 3 పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టబోతున్నారు.

- Advertisement -

గేమ్ ఛేంజర్ రాకకు కూడా ముహూర్తం ఖరారు…

ఇక శంకర్ రెండు పడవల ప్రయాణంలో ఉన్న మరొక మూవీ గేమ్ ఛేంజర్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా చాలాకాలం నుంచి సెట్స్ పైనే ఉంది. ఏళ్ల తరబడి షూటింగ్ జరుపుకుంటున్న గేమ్ ఛేంజర్ మూవీలో రాజోలు భామ అంజలి, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, సముద్రకని, హరి జోష్, ఎస్ జె సూర్య తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీని వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

పనిలో పనిగా ఈ మూవీకి రాకకు కూడా శంకర్ ముహూర్తాన్ని ఖరారు చేశారని తాజా సమాచారం. 2024 అక్టోబర్ లో గేమ్ ఛేంజర్ మూవీని థియేటర్లోకి తీసుకురావడానికి ఆయన ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే అక్టోబర్ 10న దసరా కానుకగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ రిలీజ్ కాబోతోంది. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా దసరా సెలవులను దృష్టిలో పెట్టుకొని డైరెక్టర్ శంకర్ గేమ్ ఛేంజర్ మూవీని అక్టోబర్ తొలివారంలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్టు టాక్ నడుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు