శేఖర్ వర్మ, వైభవి జంటగా SMS క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి రఘు బాబు నిర్మిస్తున్న సినిమా కళ్యాణమస్తు. తాజాగా ఈ సినిమాలోని ముక్కుపుడక అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది. ముఖ్యంగా హీరో శేఖర్ వర్మ చేసిన స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి.
గల గల ఈ మాటల్లో ఉందే పిల్ల జాతర..
సుర సుర నీ చూపుల్లో ఉందే మందుపాతర..
నిగ నిగ నీ బుగ్గల్లో నింపినావే చక్కెర..
అంటూ సాగే ఈ పాటను మంగ్లీ, ధృవన్ పాడారు. O. సాయి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మల్లికార్జున్ నరగాని సినిమాటోగ్రాఫర్ గా ఉన్నారు. RR ధ్రువన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు VVNV సురేష్ ఎడిటర్. సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.
నటీనటులు:
శేఖర్ వర్మ, వైభవి..
దర్శకుడు : O. సాయి
నిర్మాత : బోయపాటి రఘుబాబు
Dop : మల్లికార్జున్ నరగాని
సంగీతం : RR ధృవన్
ఎడిటర్ : VVNV సురేష్
సింగర్స్ : మంగ్లీ, RR ధృవన్
లిరిసిస్ట్ : అలరాజు
బ్యానర్ : SMS క్రియేషన్స్