ఈ వారం ఓటీటీల్లో సందడి చేసే మూవీస్

సినీ ల‌వ‌ర్స్ థియేట‌ర్స్ క‌న్నా.. ఓటీటీల‌కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. క‌రోనా మ‌హమ్మారి నుంచి ఆడియ‌న్స్ మొత్తం ఓటీటీల బాట ప‌ట్టారు. ఒక్కొక్క‌రు రెండు నుంచి మూడు ఓటీటీ ప్లాట్ ఫాంల‌ను స‌బ్ స్క్రైబ్ చేసుకుంటున్నారు. దీన్ని ప్రొడ్యూస‌ర్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఓటీటీల‌కే ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చి.. సినిమాల‌తో పాటు వెబ్ సిరీస్ ల‌ను కూడా నిర్మిస్తున్నారు. కొత్త‌గా ఓటీటీలు కూడా పుట్టుకువ‌స్తున్నాయి. అయితే ప్ర‌తి వారం ఓటీటీల‌కు సినిమాలు, వెబ్ సిరీస్ లు వ‌స్తుంటాయి. తాజా గా ఈ వారంలో ఓటీటీలో వ‌చ్చే సినిమాలు, వెబ్ సిరీస్ ల గురించి చూద్ధం.

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ న‌టించిన లేటెస్ట్ మూవీ “మిష‌న్ సిండ్రెల్లా”. రంజిత్ తీవారి డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కు సిద్ధం అవుతుంది. “డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్” లో ఈ నెల 29న ఈ సినిమా విడుద‌ల కానుంది. త‌మిళంలో వ‌చ్చిన రాట్‌స‌న్ కు రీమేక్ గా దీన్ని తీశారు. ఇప్ప‌టికే తెలుగులో రాక్ష‌సుడు అని కూడా రీమేక్ వ‌చ్చింది.

అలియా భ‌ట్ లీడ్ రోల్ లో వ‌చ్చిన సినిమా “గంగుబాయి క‌తియావాడి”. సంజ‌య్ లీల భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా.. ఫిబ్ర‌వ‌రి 25న రిలీజ్ అయింది. థీయేట‌ర్స్ లో మంచి విజ‌యాన్ని అందుకున్న ఈ సినిమా ఏప్రిల్ 26న “నెట్ ఫ్లిక్స్” లో విడుద‌ల కానుంది. అలాగే హీరోయిన్ తాప్సి ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన థ్రిల్ల‌ర్ మూవీ “మిష‌న్ ఇంపాజిబుల్”. స్వ‌రూప్ ఆర్ఎస్‌జే ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. థియేట‌ర్స్ ల‌లో ఏప్రిల్ 1న రిలీజ్ అయిన ఈ సినిమా పెద్ద‌గా రాణించ‌లేదు. ఏప్రిల్ 29న “నెట్ ఫ్లిక్స్” లో రిలీజ్ కాబోతుంది. అలాగే జీ5లో ఈ నెల 29న‌ “నెవ‌ర్ కిస్ యువ‌ర్ బెస్ట్ ఫ్రెండ్” విడుద‌ల అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు