ప‌వ‌న్ ట్రెండ్ సెట్ చేస్తాడా..?

భార‌త చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఫారెన్ హీరోయిన్స్ న‌టించ‌డం కామ‌న్. ల‌గాన్ మూవీ నుంచి ఆర్ఆర్ఆర్ వ‌ర‌కు చాలా మంది విదేశీ భామ‌లు తెర‌పై క‌నిపించారు. ముఖ్యంగా బ్రిటీష్ నేప‌థ్యంలో సాగే మూవీస్ లో ఫారెన్ హీరోయిన్స్ ద‌ర్శ‌నం ఇస్తున్నారు. వీరితో సినిమా క‌ల‌ర్ ఫుల్ గా క‌నిపించ‌డంతో పాటు రియాల్టీని త‌ల‌పించేలా ఉంటుంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు విదేశీ భామ‌లు మెరిసిన ప్ర‌తి సినిమాలో ఒకే ర‌క‌మైన స్టోరీ ఉంది.

ప్ర‌తి మూవీలో ఫారెన్ హీరోయిన్స్ చేస్తున్న పాత్ర‌ల‌తో హీరోలు ల‌వ్ ట్రాక్ న‌డిపించ‌డం.. వీరి మ‌ధ్య‌లో ఒక్క విలన్ ఎంట్రీ.. క‌ట్ చేస్తే.. ప్రేమ కోసం యుద్ధాలు. ఇదే కాన్సెప్ట్ తోనే చాలా వ‌ర‌కు సినిమాలు వ‌చ్చాయి. అమీర్ ఖాన్ లగాన్, ఆర్య 1947 లవ్ స్టోరీ తో పాటు తాజా గా వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ మూవీలోనూ విదేశీ భామ‌తో హీరోలు ప్రేమాయ‌ణం సాగిస్తారు. ఇండియ‌న్ సినిమాల్లో హీరోల‌తో రోమాన్స్ చేయ‌డానికే.. ఫారెన్ హీరోయిన్స్ అన్న‌ట్టు ఒక ట్రెండ్ ఉంది.

అయితే తాజా గా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రి హ‌ర వీర మ‌ల్లు సినిమాలోనూ ఫారెన్ భామ‌ను తీసుకోవ‌డానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నార‌ట‌. నోరా ఫ‌తేహి అనే కెన‌డియ‌న్ న‌టిని తీసుకోవాల‌ని ప‌వ‌న్ కూడా సూచించాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఈ విదేశీ భామ‌ల‌తో ల‌వ్ ట్రాక్.. అనే ట్రెండ్ ను మారుస్తాడా..? లేదా అందిరి లాగే ఫారెన్ భామతో రోమాన్స్ చేస్తాడా అనేది వేచి చూడాలి. ఇదిలా ఉండ‌గా.. టెంప‌ర్, బాహుబ‌లి ది బిగినింగ్ తో పాటు కిక్ 2 లో ఐటెం సాంగ్స్ తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు నోరా ఫ‌తేహీ ప‌రిచ‌యం అయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు