ఇతర భాషల హీరోయిన్స్ కు టాలీవుడ్ ఒక సువర్ణావకాశంగా ఉంటుంది. తమిళ, మలయాళం ఇండస్ట్రీల్లో హీరోయిన్స్ గా చేసినా.. ఫేమ్ దక్కకపోవడంతో టాలీవుడ్ వైపు చూస్తున్నారు. తెలుగులో రెండు సినిమాలు చేసి.. క్రేజ్ ను సొంతం చేసుకుంటున్నారు. అనంతరం బాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీల్లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కొట్టేస్తున్నారు.
కత్రినా కైఫ్, సోనాలి బింద్రె తో పాటు చాలా మంది హీరోయిన్స్ ఇదే మంత్రాన్ని ఫాలో అయ్యారు. తాజా గా యలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ కూడా ఈ లీస్ట్ లో చేరడానికి రెడీ అవుతుంది. సంయుక్త.. మలయాళంలో అనేక సినిమాలు చేసింది. కానీ కావాల్సిన క్రేజ్ ను తెచ్చుకోలేక పోయింది. కానీ ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో దగ్గుబాటి రానా కు జోడిగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. దీని తర్వాత.. ధనుష్ మూవీతో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార ల్లో అవకాశం తెచ్చుకుంది.
కాగ టాలీవుడ్ లో తాజా గా వస్తున్న గాసిప్స్ ప్రకారం.. సంయుక్త మీనన్ కు తెలుగులో అవకాశాలు ఇవ్వడానికి ప్రొడ్యూసర్ సూర్య దేవర నాగ వంశీ తీవ్ర కష్టాలు పడుతున్నాడని టాక్. ఇప్పటికే కోలీవుడ్ హీరో ధనుష్ చేస్తున్న సినిమాలో సంయుక్త మీనన్ కు నాగ వంశీ యే ఛాన్స్ ఇప్పించాడని వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు మరి కొన్ని సినిమాల్లోనూ సంయుక్త మీనన్ ను సెలెక్ట్ చేయించడానికి తిప్పలు పడుతున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.
అయితే ఈ మలయాళీ భామపై వంశీ ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నాడని సోషల్ మీడియాల్లో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.