ఆచార్య‌తో సర్కారువారి పాట..?

భ‌ర‌త్ అనే నేను, మ‌హ‌ర్షి, స‌రిలేరు నీకెవ్వ‌రు వ‌రుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. స‌ర్కారు వారి పాట‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. గీత గోవిందం ఫేమ్ ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్, 14 రీల్స్ ప్ల‌స్, జీ. మ‌హేష్ బాబు ఎంట‌ర్‌టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. క‌రోనా కార‌ణంగా వాయిదా పడుతూ వ‌స్తున్న ఈ సినిమాను వ‌చ్చే నెల 12వ తేదీన విడుద‌ల చేయ‌డానికి చిత్ర బృందం స‌న్నాహ‌కాలు చేస్తుంది.

ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే రిలీజ్ అయిన క‌ళావ‌తి, పెన్ని, టైటిల్ సాంగ్ సినీ ల‌వ‌ర్స్ ను ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ పాట‌లతో స‌ర్కారు వారి పాటకు కావాల్సిన హైప్ క్రియేట్ అయింది. తాజా గా ఈ సినిమా నుంచి మ‌రో అప్ డేట్ రానుంది. ఈ సినిమా ట్రైల‌ర్ ను ఈ నెల 28న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తుందని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.. థియేట‌ర్స్ లో మెగా స్టార్ ఆచార్య సినిమాతో ఈ ట్రైల‌ర్ ను ప్ర‌ద‌ర్శించనున్నార‌ట‌. దీని వ‌ల్ల‌ స‌ర్కారు వారి పాటపై అంచ‌నాలు భారీగా పెరిగుతాయ‌ని మూవీ యూనిట్ భావిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు