ఈ బాధ‌లు ఇక త‌ప్ప‌వా..?

టాలీవుడ్ ఈ మ‌ధ్య భారీ బ‌డ్జెట్ సినిమాలు ఎక్కువ‌గా రిలీజ్ అవుతున్నాయి. బాల‌కృష్ణ అఖండ నుంచి ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ వ‌ర‌కు క‌మర్షియ‌ల్ చిత్రాలు వ‌స్తున్నాయి. క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల వాయిదా పడుతూ వ‌చ్చిన సినిమాలను నిర్మాత‌లు ఇప్పుడు విడుద‌ల చేస్తున్నారు. స్టార్ హీరోలు న‌టించ‌డం, భారీ బ‌డ్జెట్ చిత్రాలు కావ‌డంతో తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు టికెట్లు పెంచుకోవ‌డానికి అనుమ‌తులు ఇస్తున్నాయి. దీంతో కొన్ని భారీ బ‌డ్జెట్ సినిమాల‌కు థియేట‌ర్స్ ల‌లో సాధార‌ణం కంటే.. ఎక్కువ ధ‌ర‌లు ఉంటున్నాయి. మొదటి ప‌ది రోజులు అయితే సినీ ల‌వ‌ర్స్ థియేట‌ర్ కు వెళ్లాలంటేనే జంకుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం దాదాపు అంద‌రు స్టార్ హీరో సినిమాల‌కు టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకోవ‌డానికి అనుమ‌తి ఇస్తుంది. ఏపీ ప్ర‌భుత్వం ముందుగా బాల‌కృష్ణ అఖండ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ భీమ్లా నాయ‌క్ సినిమాల‌కు టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకోవ‌డానికి అనుమ‌తి ఇవ్వ‌లేదు. కానీ త‌ర్వాత వ‌చ్చిన రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 సినిమాల‌కు టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకోవ‌డానికి అనుమ‌తి ఇస్తుంది.

తాజా గా మెగా స్టార్ ఆచార్య, సూప‌ర్ స్టార్ స‌ర్కారు వారి పాట సినిమాల‌కు కూడా టికెట్ల ధ‌ర‌ల‌ను భారీగా పెంచుకోవ‌డానికి అనుమ‌తి ఇవ్వ‌డానికి తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు రెడీ అవుతున్నాయి. దీని వ‌ల్ల నిర్మాతల ఖ‌జానా నిండుతుంది కానీ ప్రేక్ష‌కుల జేబుకు చిల్లు ప‌డుతుంది. పెద్ద సినిమాల‌కు టికెట్ల ధ‌ర‌ల బాధ‌లు త‌ప్ప‌వా.. అని ప్రేక్ష‌కులు అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు