మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీ స్టారర్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మిస్తుంది. ఆచార్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 23న గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సినిమాను ఈ నెల 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లలో విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. అయితే విడుదలకు ముందు హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్ కు ఆచార్య చిత్ర బృందం బిగ్ షాక్ ఇచ్చింది.
ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కి జంటగా కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే ను తీసుకున్నారు. అయితే ఇటీవల రిలీజ్ అయిన ఆచార్య ట్రైలర్ లో కాజల్ ఒక్క సీన్ కూడా కనిపించలేదు. అప్పటి నుంచే.. కాజల్ అవుట్ అని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను నిజం చేస్తూ.. ఆచార్యలో కాజల్ సన్నీవేశాలను కట్ చేశామని చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్ చేసింది. దీంతో 3 గంటల నిడివి ఉన్న సినిమా.. 2 :46 గంటలకు చేరిందని సమాచారం.
కాగ కాజల్ ను ఆచార్య నుంచి తొలగించడంపై డైరెక్టర్ కొరిటాల శివ స్పందించాడు. ఆచార్య సినిమాలో చిరంజీవికి జోడిగా కాజల్ ను తీసుకున్నామని.. నాలుగు రోజుల షూటింగ్ కూడా చేశామని తెలిపారు. అయితే ఈ సినిమాలో మెగా స్టార్ నక్సలిజం సిద్ధాంతాలు ఉన్న పాత్రలో ఉంటారని తెలిపారు. అలాంటి పాత్రకు లవ్ సీన్స్ పెట్టడం సరికాదని అన్నారు. అందుకే కాజల్ పాత్రను తొలగించాల్సి వచ్చిందని వివరించాడు. దీని గురించి కాజల్ కు చెప్పామని అన్నారు. ఆమె అర్థం చేసుకుందని తెలిపాడు.