మూడేళ్ళ గ్యాప్ తర్వాత మెగా స్టార్ చిరంజీవి ఆచార్య తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆర్ఆర్ఆర్ తో సెన్సెషన్ క్రియేట్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కనిపించబోతున్నాడు. ఈ మూవీ కొరటాల శివ డైరెక్షన్ లో,మాట్నీ ఎంటర్తైన్మెంట్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆచార్య చిత్ర బృందం పోస్టు ప్రొడక్షన్ పనుల్లో బిజీ ఉంది. ఈ రోజు యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళితో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.
అయితే ఆచార్య చిత్ర బృందంపై మెగా ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. డైరెక్టర్ కొరటాల శివ తీసుకుంటున్న నిర్ణయాలను ఫ్యాన్స్ కు మింగుడుపడటం లేదట. కొంత మంది మెగా అభిమానులు అయితే కొరటాల శివపై ఫైర్ అవుతున్నారట. ఎందుకంటే.. ఆచార్య సినిమా వాయిస్ ఓవర్ కోసం కోసం సూపర్ స్టార్ మహేష్ బాబును కొరటాల శివ రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కీలకమైన పాదఘట్టం గురించి మహేష్ తన వాయిస్ తో పరిచయం చేయనున్నాడు. అసలు వివాదం అంతా ఇక్కడే.. ఉంది.
ఈ సినిమాకు వాయిస్ ఓవర్.. సూపర్ స్టార్ మహేష్ బాబును కాకుండా.. మెగా కంపౌండ్ నుంచే హీరోలను తీసుకోవాల్సిందని ఫ్యాన్స్ అంటున్నారట. విపరీతమైన క్రేజ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను గానీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో గానీ వాయిస్ ఓవర్ చేస్తే బాగుండేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. కొరటాల శివ నిర్ణయాల వల్లే సినిమాపై నెగెటివ్ టాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఫైర్ అవుతున్నారట. దీంతో మెగా కంపౌండ్ నుంచి కాకుండా.. సూపర్ స్టార్ తో వాయిస్ ఓవర్ ఇవ్వడం ఆచార్యకు ఎంతవరకు కలిసివస్తుందో చూడాలి మరి.