వెంకీమామతో బాలీవుడ్ స్టార్ హీరో మ‌ల్టీ స్టార‌ర్..?

బాలీవుడ్ మొత్తం సౌత్ స్టార్స్ వైపు చూస్తుంది. ఈ మ‌ధ్య కాలంలో సౌత్ నుంచి వ‌చ్చిన సినిమాలు పాన్ ఇండియా రెంజ్ లో పెద్ద హిట్స్ అందుకుంటున్నాయి. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 అసాధార‌ణ విజ‌యాన్ని సాధించాయి. తాజా గా తెలుగు డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన జెర్సీ బాలీవుడ్ లో సెన్సెష‌న్ క్రియేట్ చేస్తుంది. దీంతో బాలీవుడ్ హీరోలు, డైరెక్ట‌ర్స్.. సౌత్ పై దృష్టి పెడుతున్నారు. త‌మ సినిమాల్లో సౌత్ నుంచి న‌టీన‌టులు, డైరెక్ట‌ర్స్ ఉండేలా.. చూస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా.. టాలీవుడ్ లో మ‌ల్టీ స్టార‌ర్ రీ-ట్రెండ్ న‌డుస్తుంది. విక్ట‌రీ వెంక‌టేష్ – సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు తో వ‌చ్చిన సిత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. కాగ ఈ సినిమా త‌ర్వాత‌.. చాలా మంది హీరోలు మ‌ల్టీ స్టార‌ర్ చేస్తూ వ‌స్తున్నారు. ఇటీవ‌ల మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ – యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మల్టీ స్టార‌ర్ గా చేసిన ఆర్ఆర్ఆర్ ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన‌వ‌స‌రం లేదు. వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ సినిమా రూ. 1,100 కోట్లు వ‌సూలు చేసి.. ప్ర‌స్తుతం అత్య‌ధికంగా క‌లెక్ష‌న్లు చేసిన లీస్ట్ లో రెండో స్థానంలో ఉంది.

విక్ట‌రీ వెంక‌టేష్.. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు నుంచి లేటెస్ట్ ఎఫ్ 3 వ‌ర‌కు పూర్తిగా మ‌ల్టీ స్టార‌ర్స్ చేస్తున్నాడు. ఇక ముందు కూడా ఈ త‌ర‌హా సినిమాలు చేయ‌డానికే.. ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అయితే వెంకీమామ.. తాజా గా మ‌రో భారీ మల్టీ స్టార‌ర్ ప్రాజ‌క్ట్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మ‌న్ ఖాన్.. త‌న మ‌ల్టీ స్టార‌ర్ పాన్ ఇండియా మూవీలో వెంక‌టేష్ ఉండాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. దీనికి వెంకీ కూడా అంగీక‌రించ‌డంతో.. స్టోరీ గురించి చ‌ర్చ‌లు న‌డుస్తున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వర్గాల స‌మాచారం. అయితే ప్రాజెక్ట్ కు సంబంధించి అఫీషియ‌ల్ అనౌన్స్ అతి త్వ‌ర‌లోనే వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు