Megastar : నేను బాధితుడినే

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య చిత్రం ఎంత పెద్ద ప్లాప్ అయిందో అందరికీ తెలుసు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్ లోనే పెద్ద డిజాస్టార్ గా మిగిలింది. దీనిపై మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. ఇప్పటి వరకు ఆచార్య సినిమా పై చిరంజీవి స్పందించలేదు. తాజాగా ఆచార్య అపజయం పై చిరు నోరు విప్పాడు. జాతి రత్నాలు సినిమా దర్శకుడు అనుదీప్ కథ, స్క్రిన్ ప్లే అందించిన చిత్రం “ఫస్ట్ డే ఫస్ట్ షో”. వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ సంయుక్తంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 2న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

దీనికి ముందు ప్రమోషన్ లో భాగంగా ఆగస్టు 31వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆచార్య అపజయం పై, అలాగే దర్శకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాల్ని జనం ఆదరిస్తారని లేక పోతే తిరస్కరిస్తారని అన్నారు. తాను కూడా ఒక బాధితుడినే అంటూ ఆచార్య సినిమాను ప్రస్తావించారు. అలాగే కంటెంట్ బాగా ఉండి హిట్ అయిన ‘బింబిసార’, ‘సీతారామం’, ‘కార్తికేయ-2’ సినిమాల విజయాలను కూడా గుర్తు చేశారు.

అలాగే “దర్శకులు కథ మీద మాత్రమే ఫోకస్ పెట్టండి. సినిమా రిలీజ్ మీద, కాంబినేషన్ల పై కాదు. మంచి కథ లేకుండా స్టార్ హీరోలు, హిట్ కాంబినేషన్లు సెట్ చేసుకుని ఏం లాభం” అంటూ చిరంజీవి అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు ఒక దర్శకుడిని ఉద్ధేశించి అన్నారు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు