Bhola Shankar : ఇంకెన్ని రీమేక్ లు చేస్తారయ్యా సామి..ఇంకా మారారా – మెగా స్టార్ పై ఫ్యాన్స్ ఫైర్

మెగా ఫ్యామిలి రీమేక్ సినిమా గురించి అందరికి తెలిసిందే. స్ట్రయిట్ సినిమాలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద తేడా కొట్టిన ప్రతిసారి మెగా ఫ్యామిలీ హీరోలు ఇతర భాషల్లో హిట్టైన సినిమాలు తెలుగులో రీమేక్ చేసి వాళ్ళ ఇమేజ్ ని కాపాడుకుంటారు. అయితే ఈ విధంగా చేయడం తప్పేమి కాదు. కానీ అదే పనిగా స్ట్రయిట్ సినిమాలు చేసే అవకాశం ఉన్నాకూడా రీమేక్ సినిమాలు చేయడానికే ఆసక్తి చూపించడం మాత్రం ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తుంది.

మెగా స్టార్ చిరంజీవి సీనియర్ డైరెక్టర్ లని పక్కన పెట్టి, ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ లతో కలిసి పని చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా మరియు బింబిసార ఫేం వశిస్ట్ మల్లిడి తో మరో సినిమా మెగా స్టార్ కమిట్ అయ్యాడు. భోళా శంకర్ సినిమా అనంతరం ఈ రెండు సినిమాలలో ఏది ముందు మొదలవుతుందనే విషయంపై క్లారిటీ రానుంది.

అయితే చిరంజీవి, డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయబోయే సినిమా మలయాళ సినిమా రీమేక్ అని ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మోహన్ లాల్, పృథ్వీ రాజ్ సుకుమారన్ కాంబినేషన్ లో వచ్చిన బ్రో డాడీ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రాబోతుందని, మెగా స్టార్ తో ఈ సినిమాలో యంగ్ సెన్సేషన్ సిద్దు జొన్నలగడ్డ కూడా కలిసి నటించబోతున్నాడని సోషల్ మీడియాలో ఓ వార్త ట్రెండ్ అవుతుంది. అయితే ఈ న్యూస్ లో ఎంత నిజముందో తెలియదు ఈ విషయంపై మాత్రం మెగా ఫ్యాన్స్ చాలా ఫైర్ అవుతున్నారు.

- Advertisement -

గతంలో మెగా స్టార్ కం బ్యాక్ సినిమానే రీమేక్ సినిమా చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఫ్యాన్స్ చాలా రోజుల తరువాత సినిమా చిరంజీవి సినిమా చేస్తున్నాడు కాదా అని సరి పెట్టుకున్నారు. ఆ తరువాత సైరా, ఆచార్య సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద తేడా కొట్టడంతో మళ్ళీ రీమేక్ సినిమా చేయడానికే మెగా స్టార్ ఆసక్తి చూపించాడు. ఆల్రెడీ తెలుగులో వచ్చిన లూసిఫర్ సినిమాని రీమేక్ చేసాడు. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తోన్న భోళా శంకర్ కూడా రీమేక్ సినిమానే, ఇవి చాలవన్నట్టు మళ్ళీ ఇంకో రీమేక్ సినిమానా అంటూ మెగా ఫ్యాన్స్ చిరంజీవి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రీమేక్ సినిమాలు చాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు వేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు