Mama Machhindra: రిలీజైన రెండు రోజుల్లోనే ఓటిటిలోకి

ఈ మధ్య కాలంలో థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాలు చడీ చడీ లేకుండా ఓటిటి లో దర్శనం ఇవ్వడం చూస్తూనే ఉన్నాం, సినిమా హిట్ ఫ్లాప్ అనే తేడా లేకుండా ఏ సినిమా అయిన రిలీజైన కొద్దిరోజుల్లోనే ఓటిటి లో రిలీజ్ అవుతూ ప్రేక్షకులకు థియేటర్స్ వెళ్లి సినిమా చూసే శ్రమ ను తగ్గిస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా ఇటీవలనే థియేటర్స్ లో రిలీజైన ఒక సినిమా నైతే ఏకంగా రిలీజ్ అయిన రెండవ రోజునే ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకుంది.

సుధీర్ బాబు హీరోగా నటించిన మామా మశ్చీంద్ర సినిమా రెండు రోజుల క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయింది. ప్రముఖ నటుడు హర్షవర్ధన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్షింపబడుతుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు సృష్టి సెల్యులాయిడ్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమా ఇక అక్టోబర్ 20 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో లో అందుబాటులోకి రానున్నట్టు అఫీషియల్ ప్రకటించింది అమెజాన్ స్ట్రీమింగ్ సంస్థ. అలాగే ఈ సినిమా అమెజాన్తో పాటు ఆహా లో త్వరలోనే అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తుంది.

అయితే సినిమా పరంగా చూస్తే రిలీజ్ట్ ఎలా ఉన్న కొద్దీ రోజుల పాటు ఏ సినిమా నైనా థియేటర్స్ లో ఆడుతున్న సమయంలో ఓటిటి రిలీజ్ డేట్ ప్రకటించడం అనేది చింతించాల్సిన విషయమే ఎందుకంటే సాధారణ ప్రేక్షకులు టాక్ తో సంబంధం లేకుండా థియేటర్స్ లో సినిమా చూడాలనుకునే వాళ్ళుకు ఓటిటి రిలీజ్ డేట్ ముందే తెలిస్తే వాళ్లు థియేటర్స్ సినిమా చూడటానికి వెళ్లకుండా ఉంటారు దాని వాళ్ళ సినిమాను పురిట్లోనే చంపేసినట్టు అవుతుంది. ఇప్పుడిప్పుడే వేగంగా ప్రబలుతున్న ఈ పోకడ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు