Malaika: ప్రెగ్నెంట్ వార్తలపై స్పందించిన మలైకా

బాలీవుడ్ హీరోయిన్ మలైకా ఆరోరా, హీరో అర్జున్ కపూర్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. 49 ఏళ్ల వయసు ఉన్న మలైకా, 37 ఏళ్ల వయసు ఉన్న అర్జున్ చట్టాపట్టాలేసుకుని ముంబై మొత్తం తిరిగితే చాలా ట్రోల్స్ వస్తున్నాయి. 12 ఏళ్ల చిన్న వాడితో ప్రేమా అంటూ మలైకాపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అయినా ఈ ప్రేమ జంట ట్రోలర్స్, నెటిజన్లు పక్కన పెట్టి తమ పని తాము చేసుకుంటున్నారు. చాలా రోజుల నుంచి డేటింగ్ లో కూడా ఉంటున్నారు.

అయితే గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. మలైకా ఆరోరా ప్రెగ్నెంట్ అని, దీనిపై ఆమె ఇంకా అధికారికంగా ప్రకటించలేదని, మలైకా ఆరోరా, అర్జున్ కపూర్ తల్లి దండ్రులు కాబోతున్నారు అంటూ అనేక వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై మలైకా బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చారు. తాజాగా మలైకా ఆరోరా కూడా ఈ వార్తలపై స్పందించింది. తన ఇన్ స్టాగ్రామ్ లో తీవ్రమైన పదజాలంతో ఈ వార్తలను ఖండించింది.

F***, DISGUSTING అంటూ ఈ వార్తల్లో నిజం లేదని తెల్చి చెప్పింది. కాగా మలైకా ఆరోరాకు ఇప్పటికే అర్భాజ్ ఖాన్ అనే వ్యక్తితో పెళ్లై విడాకులు అయిన విషయం తెలిసిందే. ఈమెకు అర్హాన్ ఖాన్ అనే కొడుకు కూడా ఉన్నాడు. అర్హాన్ ఖాన్ ప్రస్తుతం మలైకాతోనే ఉంటున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు