Guntur Karam: మహేష్ ఫ్యాన్స్.. ఆ రికార్డు ఒకే.. మరి ఇది?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో వస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక గా నటిస్తుంది. సర్కారు వారి పాట తర్వాత మహేష్ చేస్తున్న చిత్రమిది. ఇక మహేష్ త్రివిక్రమ్ కలయికలో వస్తున్న మూడో చిత్రం కావడంతో మహేష్ అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ లోను ఈ సినిమాపై విపరీతమైన అంచనాలున్నాయి. దీనికి తోడు కొన్ని రోజులకిందట విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమాపై ఉన్న అంచనాలను విపరీతంగా పెంచేసింది. ఇక తాజాగా “గుంటూరు కారం” ఫస్ట్ లుక్ గ్లిమ్ప్స్ విడుదల కాగా ఆ వీడియో అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది.

మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్బంగా గుంటూరు కారం గ్లిమ్ప్స్ విడుదల చేయగా విడుదలైన కొన్ని గంటల్లోనే ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ ని దక్కించుకోగా వ్యూస్ పరంగా ఆల్ టైం రికార్డు కొట్టింది ఈ వీడియో. విడుదలైన 24 గంటల్లో 20.98 మిలియన్ల వ్యూస్ తో గ్లిమ్ప్స్ లో ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది. ఇంతకు ముందున్న వేర్ ఈజ్ ది పుష్ప గ్లిమ్ప్స్(20.45 ) ని చిన్న మార్జిన్ తో బ్రేక్ చేసి రికార్డు కొట్టేయగా, లైక్ల పరంగా టాప్ 5 లో కూడా చోటు దక్కించుకోకపోవడం గమనార్హం.

విడుదలైన 24 గంటల్లో గుంటూరు కారం 348k లైక్స్ ని దక్కించుకోగా ఓవరాల్ గా 7వ స్థానం లో నిలిచింది. ఇక గ్లిమ్ప్స్ లైక్స్ లో మొదటిస్థానంలో భీమ్లా నాయక్ (728k) మొదటి స్థానంలో ఉంది. అయితే మహేష్ అభిమానులు ఈసారి లైక్స్ పరంగా రికార్డు మిస్సవగా మళ్ళీ విడుదల చేసే టీజర్ తో అన్ని రికార్డులు తుడిచి పెట్టేయాలని చూస్తున్నారు. మరి చూడాలి రానున్న రోజుల్లో ఏ గ్లిమ్ప్స్ రికార్డులు క్రియేట్ చేస్తుందో.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు