Guntur Kaaram: బాబు గారు మూవీ కంటే… వెకేషన్‌కి ఇచ్చిన డేట్సే ఎక్కువ?

సూపర్ స్టార్ మహేష్ బాబు… ఈ టాలీవుడ్ టైర్ 1 హీరో నుంచి వచ్చిన చివరి సినిమా సర్కారు వారి పాట. గతేడాది మేలో ఈ మూవీ వచ్చింది. దీని తర్వాత కొద్ది రోజులకే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా స్టార్ట్ అయింది. నిజానికి ఈ మూవీని SSMB28 అనే వర్కింగ్ టైటిల్‌తో 2021లో అనౌన్స్ చేశారు. కానీ, కెమెరా ముందుకు వచ్చింది మాత్రం గతేడాది సెప్టెంబర్.

అప్పటి నుంచి ఎన్నో అల్ల కల్లోలా మధ్య షూటింగ్ జరుగుతూ వచ్చింది. మూవీ యూనిట్‌లో చాలా మార్పులు జరిగాయి. ఈ మార్పులు జరిగిన ప్రతి సారి మహేష్ బాబు ఫ్లైట్ ఎక్కి, వెకేషన్ వెళ్లడం కామన్ గా మారిపోయింది. ఫైట్ మాస్టర్స్ ఇష్యూ నుంచి స్టోరీలో ఛేంజెస్‌తో పాటు ఇలా ఏ చిన్న సమస్య వచ్చిన మహేష్ ఫస్ట్ ఆప్షన్ వెకేషనే. ఇలా మొత్తంగా చూస్తే గుంటూరు కారం మూవీకి మహేష్ ఇచ్చిన ఇచ్చిన డేట్స్ కంటే, వెకేషన్స్‌కి ఇచ్చిన డేట్సే ఎక్కువగా ఉంటాయని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం సినిమాలోని ఓ సాంగ్ షూటింగ్ జరుగుతుంది. ఇది పూర్తి అయిన వెంటనే మళ్లీ మన బాబు గారు ఫ్యామిలీతో కలిసి ఫ్లైట్ ఎక్కబోతున్నారట. రిలీజ్ డేట్ దగ్గరపడుతుంది. ప్రమోషన్స్ ఏం స్టార్ట్ చేయలేదు. అయినా, బాబు గారు తన న్యూయర్ సెలబ్రేషన్ కోసం ఫారెన్ వెళ్తున్నారట. అందులోనూ ఈ సారి వెకేషన్ ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా వారం రోజుల పాటు ఉండబోతుందట.

- Advertisement -

ఎంజాయ్మెంట్ పూర్తి అయ్యాక, తిరిగొచ్చి అప్పుడు ప్రమోషన్స్ పైన ఫోకస్ చేస్తారట. అది కూడా ఎక్కువ రోజులేం కాదు. ఒక ప్రమోషన్ ఈవెంట్, ఒక ఇంటర్వ్యూ ఉండేలా చూస్తున్నారట. అంతకు మించి ప్రమోషన్స్ చేసే ఆలోచనే లేదట. అలా మొత్తం మీద 2023 ఇయర్ మొత్తం బాబు గారికి గుంటూరు కారం కంటే ఫ్టైట్ ఫారెన్ వెకేషన్ వెళ్లడమే ఎక్కువగా జరిగింది అన్నమాట.

ఇందంతా… త్రివిక్రమ్ సినిమా కాబట్టి అలా జరిగిపోయింది. వచ్చేది రాజమౌళి సినిమా. ఒక సారి మూవీ స్టార్ట్ అయిందంటే, వెకేషన్స్ ఉండవు. పార్టీలు ఉండవు. అంత ఎందుకు లుక్ లీక్ అవుతుందని మహేష్ ను అసలు బయటికే పంపించరు జక్కన్న. ఇది మహేష్ కూడా తెలుసు. అందుకే తన ఎంజాయ్మెంట్ అంతా ఈ ఇయరే ప్లాన్ చేసుకుంటున్నాడు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు